చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో కృష్ణంరాజు     2018-07-03   00:47:02  IST  Bhanu C

తెలుగు సినిమా పాత తరం హీరో అయిన రెబల్ స్టార్ కృష్ణం రాజు సినిమా జీవితంతో పాటుగా రాజకీయ జీవితంలో కూడా ఒకానొక దశలో వెలుగొందారు..అయితే ఈ మధ్య యాక్టివ్ పాలిటిక్స్ లో లేకపోయినా సరే అప్పుడప్పుడు మీడియా ముందు ఎవో కొన్ని వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో ఫోకస్ అవుతూ ఉంటారు ఆ తరువాత షరా మామూలే..అయితే ఏపీ నుంచీ బీజేపీ లో సీనియర్ లీడర్ గా ఉన్న కృష్ణం రాజు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు..వచ్చీ రాగానే చంద్రబాబు పై సంచలన ఆరోపణలు చేశారు..

అయితే ఈ ఆరోపణల వెనుకాల ఎలాంటి స్వార్ధం ఉందనేది పక్కన పెడితే చంద్రబాబు ని మాత్రం ఏకి పడేశారు..పొత్తుల తరువాత బీజేపీని ఇబ్బంది పెట్టడం బాబు కి కొత్తేమి కాదు కదా అంటూ విమర్శించారు..అయితే గతంలోలాగా చంద్రబాబునాయుడు 20 గంటలకు పైగా ఇప్పుడు కూడ కష్టపడుతున్నాడని చెప్పారు. అయితే అప్పుడేమో ప్రజల కోసం కష్టపడ్డాడని, ఇప్పుడేమో అబద్దాలను నిజం చేయడం కోసం కష్టపడుతున్నాడని ఆయన ఆరోపించారు.