బ్రిటన్ నిభంధనతో భారత విద్యార్ధుల కి కష్టాలు..     2018-06-17   00:09:57  IST  Bhanu C

బ్రిటన్ ప్రభుత్వం రూపొందిచిన తాజా స్టూడెంట్ వీసా విధానంలో భారత్ ని చేర్చకుండానే విధానాలని విడుదల చేసింది దాంతో ఒక్కసారిగా భారత విద్యార్ధులలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి..రెండు రోజుల క్రితం భారత వైద్యులకోసం బ్రిటన్ ఏకంగా వీసా నిభంధనలనే మార్చి వెసులుబాటు కల్పిస్తే మరి విద్యార్ధుల విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది…అయితే వీసాలకి వెసులు బాటు ఇస్తూ దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేస్తూ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

4 టైర్ వీసా..కేటగిరిలో విద్యార్ధులకి వెసులుబాటు ఇస్తూ హోంశాఖ ప్రకటన చేసింది అయితే కొత్త జాబితాలో 25 దేశాలను చేర్చారు. ఇప్పటికే అమెరికా, కెనడా, న్యూజిలాండ్ దేశాలు జాబితాలో ఉండగా కొత్తగా చైనా, బహ్రెయిన్, సెర్బియా చేరాయి. ఈ దేశాల నుంచి వచ్చే విద్యార్థులకు అనేక సడలింపులు కల్పించారు…దీంట్లో విద్యార్ధి ఆర్దిక మరియు ఆంగ్ల బాషా పరిజ్ఞానం ఆపై నిభందనలు ఏమీ ఉండవు దాంతో వీరు బ్రిటీష్ విశ్వవిద్యాలయాల్లో వారు సులభంగానే ప్రవేశాల పొందవచ్చు…అయితే ఈ జాబితాలో భారత్ పేరు లేకపోవడంతో భారత్ తీవ్రంగా మండిపడుతోంది.