బ్రిటన్ లో “భారతీయ డాక్టర్ల” చెరగని ముద్ర     2018-05-03   01:23:26  IST  Bhanu C

దేశ విదేశాలలో వైద్య విధానంలో కానీ, కంప్యూటర్ రంగంలో గాని ఎంతో ముందుకు వెళ్ళాయి అభివృద్ధి చెందాయి అయితే ప్రతీ దేశ అభివృద్ధి పై తప్పకుండా భారతీయుల ప్రభావం ఉంటుంది..తప్పకుండా భారతీయులు ఆయా దేశాల అభివృద్దిలో ఎప్పుడు భాగస్వాములుగా ఉంటూనే ఉంటారు..అంతేకాదు అక్కడి ప్రజల మన్ననలు అందుకుంటూ ఉంటారు..తాజాగా బ్రిటన్ భారతీయులు చేసిన సేవలు మర్చిపోలేనివి అంటూ పాతజ్ఞాపకాలని నేమరువేసుకున్నాయి తమ వైద్య వ్యవస్థలో భారతీయుల చేసిన మార్పులని కొనియాడారు..వివరాలలోకి వెళ్తే

ఎన్నో దశాబ్దాలుగా భారతీయ డాక్టర్లు బ్రిటన్‌ ఆరోగ్య వ్యవస్థ నిర్మాణంలో అందిస్తున్న తీరును బ్రిటన్‌ సమాజం ప్రశంసించింది…గౌరవించింది..అంతేకాదు వారు చేసిన సేవలని గుర్తిస్తూ ఎన్‌హెచ్‌ఎస్‌ 70వ వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల లండన్‌లోని రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ జనరల్‌ ప్రాక్టీషనర్స్‌(ఆర్‌సీజీపీ)లో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దక్షిణాసియా నుంచి ప్రత్యేకించి భారత్‌ నుంచి వచ్చిన డాక్టర్లు బ్రిటన్‌లో విశేష సేవలందించిన తీరుని అభినందించారు..