'యూ టర్న్' తో 'సమంత' సక్సెఫుల్ కెరీర్ టర్న్ అయ్యిందా లేక హిట్ కొట్టిందా.? స్టోరీ, రివ్యూ, రేటింగ్.!     2018-09-13   10:03:24  IST  Sainath G

Movie Title; యూ టర్న్

Cast & Crew:
న‌టీన‌టులు: సమంత అక్కినేని, భూమిక చావ్లా, రాహుల్ రవీంద్రన్, ఆది పినిశెట్టి త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: పవన్ కుమార్
నిర్మాత‌: శ్రీనివాస చిట్టూరి, రామ్ బాబు బండారు
సంగీతం: పూర్ణ చంద్ర తేజస్వి

Samantha U Turn Movie Review,U Turn Movie Collections,U Turn Movie Review Adn Rating

STORY:
రచన (సమంత) టైమ్స్ అఫ్ ఇండియా లో జర్నలిస్ట్ గా పనిచేస్తుంది. తన కొలీగ్ అయిన క్రైమ్ రిపోర్టర్ రాహుల్ రవీంద్రన్ తో ప్రేమలో పడుతుంది. ఈ లోపు ఆర్.కె . పురం ఫ్లై ఓవర్ వద్ద జరిగిన దారుణంని సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది రచన. అక్కడ ఇటుకలు, సిమెంట్ ఎవరు సప్లై చేసారు, ఫ్లై ఓవర్ ఎలా కూలిపోయింది అనే విషయాలపై ఆరా తీస్తూ ఉంటుంది. ఈ విషయాలన్నీ తెలిసిన ఒక విట్నెస్ ను కలిసే సమయానికి అతను ఆత్మహత్య చేసుకుంటాడు. అలా ఈ విషయం గురించి తెలిసిన వారందరి లిస్ట్ తయారు చేస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటి అంటే…లిస్ట్ లో ఉన్న వారందరు ఒకరి తర్వాత ఒకరు సూసైడ్ చేసుకుంటారు. ఇంతలో పోలీసులు రచన ను అరెస్ట్ చేస్తారు. కానీ ఎస్సై ఆది (ఆది పినిశెట్టి) రచన అమాయకురాలు అని నమ్మి ఆమెను విడుదల చేస్తారు. ఇంత జరిగినా రచన మాత్రం ఈ కేసును వదిలిపెట్టాలి అనుకోడు..మిస్టరీ ఏంటో కనిపెట్టాలి అనుకుంటుంది. ఆ క్రమంలో ఎలాంటి నిజాలు తెలుసుకుంది…మరో ఇద్దర్ని ఎలా కాపాడింది అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.!

Samantha U Turn Movie Review,U Turn Movie Collections,U Turn Movie Review Adn Rating

REVIEW:
సమంత అక్కినేని లీడ్ రోల్‌లో మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘యూటర్న్’. న్నడలో సూపర్ హిట్ అయిన ‘యూటర్న్’ మూవీని తెలుగులో అదే పేరుతో ఒరిజినల్ వెర్షన్‌కి దర్శకత్వం వహించిన పవన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతల్ని తీసుకున్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో స‌మంత, ఆది పినిశెట్టి కీల‌క‌పాత్రల్లో న‌టించారు. జర్నలిస్ట్ గా సమంత ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. పూర్ణచంద్ర తేజ‌స్వి ఈ చిత్రానికి అందించిన సంగీతం కూడా సస్పెన్స్ కి ప్లస్ పాయింట్ అయ్యింది. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ హైలైట్. తెలుగులో ఈ తరహా థ్రిల్లర్స్ చాలానే వచ్చాయి. కానీ.. స్టార్‌లు నటించిన థ్రిల్లర్లు మాత్రం అరుదుగా వస్తూ ఉంటాయి. మొత్తానికి ఈ సినిమాతో సమంత మరోసారి హిట్ కొట్టేసింది.

Plus points:
సమంత
సస్పెన్స్
సినిమాటోగ్రఫీ
డైరెక్షన్
ఆది, రాహుల్, భూమిక రోల్స్
మ్యూజిక్

Final Verdict:
సమంత కాతాలో మరో హిట్ “యూ టర్న్”…సస్పెన్స్ థ్రిల్లెర్స్ అంటే ఇష్టం ఉండేవారు ఈ చిత్రం తప్పక చూడాలి

Rating: 3.75 / 5