ఆ ఇద్దరు “టీఆర్ఎస్ నేతలు” కాంగ్రెస్ లోకి జంప్..?    2018-03-19   22:09:14  IST 

ఎన్నికల వేడి ఎపీకి మాత్రమే కాదు మరో తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణకి కూడా పాకుతోంది…టీఆర్ఎస్ లోకి రావడానికి ఒక పక్క టిక్కెట్లు ఆశిస్తున్న వారు కొంతమంది ఉంటే మరో పక్క పక్క పార్టీలోకి జంప్ చేయడానికి సిద్దంగా మరి కొంతమంది ఉన్నారు…అయితే నిజామాబాద్ జిల్లాలో అర్బన్, రూరల్‌ నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు టీఆర్‌ఎస్‌ నేతలు వచ్చే ఎన్నికల్లో ఆరునూరైనా పోటీచేయాల్సిందేనని డిసైడ్ అయిపోయారు. సీఎం కేసీఆర్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ అవకాశం ఉంటుందని ప్రకటించిన నేపధ్యంలో తమను తాము సమాధాన పరుచుకున్న నేతలు.. సీఎం కేసీఆర్ మళ్లీ అదే ప్రకటన చేయటంతో టిక్కెట్టు ఆశిస్తున్న వారు డిఫెన్స్‌లో పడ్డారు…అయితే వారిలో ఇద్దరు నేతలు ఇప్పుడు పక్క పార్టీలవైపు చూస్తున్నారు..

అంతేకాదు ఇప్పుడు ఆ ఇద్దరు టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉంటున్నారు..అయితే తమ అధినేత నుంచీ తమకి భరోసా ఉంటె మాత్రం టీఆర్ఎస్ వెంటే ఉంటామని అంటున్నారట..ఇదిలాఉంటే…ఇటీవలే కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో అర్బన్ నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ నేత చడీచప్పుడు కాకుండా వెళ్లి కలిసినట్లు గుసగుసలు నడుస్తున్నాయి. తనకు టికెటిస్తే పార్టీలోకి రావడానికి సిద్ధమని ఆ నాయకుడు పీసీసీ చీఫ్‌కి చెప్పినట్లు సమాచారం…కానీ ఉత్తం ఉంచీ ఎటువంటి హామీ లేకపోవడంతో ఇంకా ఆ నేతలు ఖంగారులోనే ఉన్నట్లుగా తెలుస్తోంది..