బీజేపి ఫతనం షురూ..ఎన్డీయే కి ఆ రెండు పార్టీలు గుడ్ బాయ్     2018-06-04   00:45:58  IST  Bhanu C

అయితే ఈ పరిస్థితిలో మా దారి మేము చూసుకున్తామి అంటూ రెండు పార్టీలు సిద్దంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.. శివసేన తరహా హిందుత్వవాదంతో కాంగ్రెస్ – ఎన్సీపీలకు ఇబ్బంది లేదు. ఎందుకంటే బీజేపీని శివసేన అడ్డుకుంటుందని కాంగ్రెస్ – ఎన్సీపీలకు తెలుసు. మరోవైపు శివసేన నుంచి విడివడిన ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ ఠాక్రే ఇప్పటికే మోడీ ముక్త్ భారత్ అని నినదించి బీజేపీయేతర పక్షాల అభిమానం పొందారు.

మరోవైపు బీహార్ సీఎం నితీశ్ కుమార్ ది మరో చిత్రమైన పరిస్థితి…ఆయనకీ రాజకీంగా శివసేనకి ఉన్న అవకాశాలు లేవు మహాకూటమి నుంచి దూకేసిన నితీశ్.. కాంగ్రెస్ – ఆర్జేడీలతో శత్రుత్వం తెచ్చుకున్నారు. దాంతో ఈ పరిణామాలతో నితీశ్ సొంతంగా అధికారానికి రాలేరు. దీం తో బీజేపీతో అంటకాగాల్సిన పరిస్థితి ఎదురవుతోంది..అయితే ఏమి చేసైనా సరే బీజేపి తో తెగ తెంపులు చేసుకుందామని ఇరు పార్టీలు తీవ్ర చర్చలు చేసుకుంటున్నారట ఒక వేళ వీరి వ్యూహాలు ఫలించి ఎన్డీయే నుంచీ వైదొలిగితే మాత్రం తప్పకుండా బీజేపి కి చావు దెబ్బ తగిలినట్టే అంటున్నారు విశ్లేషకులు.