బీజేపి ఫతనం షురూ..ఎన్డీయే కి ఆ రెండు పార్టీలు గుడ్ బాయ్     2018-06-04   00:45:58  IST  Bhanu C

ఒక వైపు మోడీ పెట్రోలు డీజిల్ ,ఆఖరికి వంట గ్యాస్ విషయంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలలో మరింత వ్యతిరేకతని మూటగట్టుకుంటున్నాడు అయితే ఈ క్రమంలో బీజేపి పార్టీకి మిత్రపక్షంగా ఉన్న నాయకులు మోడీ చర్యలతో విసిగిపోయి మోడీ కి భారీ షాక్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారట..ఇప్పటికీ ఆపార్టీ యొక్క ఎన్డీయే కూటమికి తెలుగుదేశం పార్టీ గుడ్ బాయ్ చెప్పగా మరో రెండు పార్టీలు సైతం ఇదే వరుసలో ఉన్నాయని తెలుస్తోంది… దేశవ్యాప్తంగా నాలుగు లోక్ సభ – పది అసెంబ్లీ స్థానాలకు ఇటీవలి ఉపఎన్నికల ఫలితాలు ఆ ఇరు పార్టీల కి గుబులు రేపాయి..

ఎన్డీయే లో ఉండాలా బయటకి వచ్చేయాలా అనే కోణంలో ఆలోచనలు చేస్తున్నాయి..ఇంతకీ ఆ రెండు పార్టీలు ఎవో కాదు..ప్రధాన ఎన్డీఏ పక్షాలైన శివసేన – జనతాదళ్ (యూ). బీజేపీ విస్తరణవాదం – దూకుడు తమ రాజకీయ భవిష్యత్ ని సమాధి చేసేలా ఉన్నాయని వారు తెగ కంగారు పడుతున్నారట.. అయితే శివసేనకి అంతగా బలం లేకపవడం వలన బీజేపి ని గట్టిగా ఏమి అనలేని పరిస్థితి ఏర్పడింది..బీహార్లో జేడీయూనే ప్రధాన పక్షమైనా ఇటీవలి అసెంబ్లీ ఉపఎన్నికలో దారుణ ఓటమి తర్వాత భవిష్యత్ ఏమిటనే బెంగ పీడిస్తోంది.