Two more by-elections in AP

ఏపీలో గ‌త సాధార‌ణ ఎన్నిక‌లు త‌ర్వాత మొత్తం నాలుగు అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు వ‌చ్చాయి. వీటిల్లో ఆళ్ల‌గ‌డ్డ‌లో మాత్రం భూమా అఖిల‌ప్రియ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. నందిగామ‌, తిరుప‌తి స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు నంద్యాల‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆక‌స్మికంగా మృతి చెంద‌డంతో ఇక్క‌డ ఉప ఎన్నిక జ‌రుగుతోంది.

ఈ ఉప ఎన్నిక ఇలా ఉండ‌గానే నంద్యాల ఉప ఎన్నిక సాక్షిగా మ‌రో రెండు ఉప ఎన్నిక‌ల‌కు తెర‌లేచింది. ఇక్క‌డ స‌వాళ్ల రాజ‌కీయంలో అదే క‌ర్నూలు జిల్లాలో మ‌రో రెండు స్థానాల‌కు ఉప ఎన్నికలు జ‌రిగే ఛాన్సులు ఉన్నాయి. ఈ ఉప ఎన్నిక వేళ ఇక్క‌డ రాజ‌కీయం హోరాహీరోగా సాగుతోంది. అధికార టీడీపీ నుంచి దివంగ‌త భూమా అన్న కొడుకు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి, వైసీపీ అభ్య‌ర్థిగా మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డి పోటీప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే శిల్పా మోహ‌న్‌రెడ్డి సోద‌రుడు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి టీడీపీకి షాక్ ఇస్తూ వైసీపీలోకి జంప్ అయ్యారు.