బాబోయ్..ఒక్క పెళ్ళిలో ఇన్ని ట్విస్టులా..? పెళ్లి కూతురి అన్నగా నటించి చివరికి ఆమెనే పెళ్లి చేసుకోవాలని.!     2018-06-27   01:22:49  IST  Raghu V

ఓ అమ్మాయిని ప్రేమించాడు, మతాలు అడ్డొస్తాయని భావించి మారు పేరుతో యువతి తల్లిదండ్రులను కలిశాడు. కానీ పెళ్లికి వారు అంగీకరించలేదు. దీంతో వారికి కొడుకులా మారినట్టు నటించి ఆ యువతికి పెళ్లి చేశాడు. ఆ తర్వాత తన ప్రియురాలి పెళ్లి పెటాకులు చేసేందుకు స్కెచ్ వేశాడు.

పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన షేక్ సయ్యద్ వలీ (32) డిగ్రీ వరకు చదువుకున్నాడు. తర్వాత రెండేళ్లు ఓ ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయుడిగా, ఆ తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేశాడు. ఫార్మా కంపెనీని మోసగించిన కేసులో గతేడాది మార్చిలో అతడిపై కేసు కూడా నమోదైంది. ఆ ఘటన తర్వాత వలీ తన మకాంను హైదరాబాద్‌కు మార్చాడు. ఎల్బీనగర్‌లో కన్సల్టెన్సీ తెరిచాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సామాజిక మాధ్యమాల్లో గ్రూపులు ఏర్పాటు చేసి నిరుద్యోగులను ఆకర్షించాడు. ఈ క్రమంలో ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది.

పెళ్లి చేసుకోవడం కోసం మతం అడ్డు రావడంతో రామ్ అద్వైత్ రెడ్డిగా ఆ యువతి తల్లిదండ్రులకు పరిచయం చేసుకున్నాడు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కానీ అతడి ప్రతిపాదనకు వారు అంగీకరించలేదు. అంతకు ముందే.. హిందువులుగా అమ్మాయిల పేరెంట్స్ దగ్గర నటించాలని వలీ తన తల్లిదండ్రులను వలీ కోరాడు. కానీ వారు ఒప్పుకోలేదు.