స్టార్ హీరోని ముసలోడు అనేసిన హీరోయిన్

బాలివుడ్ నటుడు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ఒకప్పుడు బాలివుడ్ లో మెరిసిన హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. అగ్రకథానాయికగా బాలివుడ్ లో రాణించిన ట్వింకిల్, ఆమీర్, సల్మాన్, షారుఖ్ లతో కూడా సినిమాలు చేసింది. అక్షయ్ ని పెళ్ళి చేసుకున్న తరువాత రచయిత్రిగా మారిన ట్వింకిల్, వ్యంగ రచనలతో మంచి పేరు సంపాదించుకుంది.

ఎప్పటిలాగే తనదైన శైలిలో కామెడీ చేస్తూ ఈమధ్యే ఓ కాలమ్ లో, పెళ్ళి ప్రకటన ఇలా ఇచ్చింది “భారతదేశంలో ఉన్న వయసు మళ్ళిన బ్యాచలర్స్ లో ఒకడు కాని అర్హత కలవాడు. ఇతనికి వధువు కావలెను. డాషింగ్, మాంసాహారి, సక్సెస్ ఫుల్, కండలవీరుడు మరియు దేసి ఫ్యామిలి అబ్బాయి. డ్యాన్స్, డ్రామా, ఆర్ట్ బాగా చేస్తాడు. అమ్మాయి అందంగా ఉండాలి. సన్నగా ఉండి లాంగ్ డ్రైవ్స్ ఎంజాయ్‌ చేసేది అయి ఉండాలి. అయితే అమ్మాయి మరీ ఎక్కువగా మాట్లాడకూడదు. ఎందుకంటే అలాంటివారిని ఈ అబ్బాయి భరించటం కష్టం. కులంతో పనిలేదు. సంప్రదించండి Sultan@bhaijaan.com”

ఈ ప్రకటన సల్మాన్ ఖాన్ గురించి అని ఈజీగా అర్థం అవుతోంది. ఇందులో సల్మాన్ ని వయసుపైబడిన వాడు అనడం అతని అభిమానులకు నచ్చలేదు. దాంతో కామెడి కొద్దీ రాసిన కాలమ్ కాస్త వివాదస్పదంగా మారింది.