అధ్వానిని చంపేసిన యాంకరమ్మ..పాపం అధ్వాని గారూ..     2018-08-19   14:20:53  IST  Sainath G

ఇటీవల చనిపోయిన రాజకీయనేత ఎవరూ అంటే చిన్నపిల్లలకు కూడా టక్కున సమాధానం చెప్తారు..ఎందుకంటే వారికి సెలవొచ్చింది కదా మరి..కానీ “ప్రముఖ “ న్యూస్ ఛానెల్ యాంకర్ మాత్రం వాజపేయిని వదిలేసి అద్వానిని చంపేసింది..అయ్యో పాపం..లైవ్ లో ఉన్నప్పుడు పొరపాట్లు జరుగుతుంటాయి సహజం..కాని ఇలాంటి మిస్టేక్స్ చేస్తే ఛానల్ యాజమాన్యం లైట్ తీస్కుంటుందేమో కాని సోషల్ మీడియా లైట్ తీస్కోదు..ఇంకోసారి తప్పు చేయకూడదు మొర్రో అని చెవులు పట్టుకుని లెంపలేసుకునేలా ట్రోల్ చేసి పడేస్తుంది..

LK Advani Death,tv9 Anchor

లైవ్ న్యూస్లో ఉన్న యాంకరమ్మ అవతల ఉన్న గెస్ట్ ని క్వశ్చన్ చేస్తూ అద్వానీని పై లోకానికి పంపించేసింది. ‘అద్వానీగారు వెళ్లిపోతూ.. ప్రజలకు ఏం సందేశమిచ్చారంటే ఏం చెప్తారు మీరు?’ అని అవతల ఉన్న వారికి మహత్తరమైన ప్రశ్న వేసింది. ఎవరు చనిపోయారో దేశమంతా తెలిసినా యాంకరమ్మ మాత్రం అద్వానీనే అనుకున్నట్టుంది. లేకపోతే పొద్దున్నుంచి వాజ్‌పేయి అని పలికి పలికి బోర్ కొట్టేసిందేమో. అద్వానీ అని పొరపాటునో, ఏమరుపాటులో పలికేసిందేమో,ఏది పలికితే ఏముందిలే ఎవరు పట్టించుకుంటారు అనుకుందో..అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే…మనం చేసే తప్పుల్ని సోషల్ మీడియా పట్టించుకుంటుంది…ఇంత చదివాక పాపం యాంకరమ్మ అంటారా..కాదు కాదు పాపం అద్వానీ గారూ..

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :https://youtu.be/7PWh-ZAr5gE