తులసి చెట్టుతో భవిష్యత్ తెలుసుకోవచ్చా? Devotional Bhakthi Songs Programs     2018-03-25   06:05:13  IST  Raghu V

Tulasi Plant Predict Your Future

మన దేశంలో తులసి చెట్టు లేని ఇల్లు ఉండదు. హిందువులు తులసి చెట్టును అత్యంత పవిత్రంగా భావిస్తారు. తులసికి ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను ఎంతో విశిష్ట స్థానం ఉంది. తులసి చెట్టు ఇంటిలో ఉంటే మంచి జరుగుతుందని హిందువులకు అపారమైన నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరు ఇంటిలో తులసి చెట్టును పెంచుతూ ప్రతి రోజు పూజలు చేస్తారు.

తులసిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాక తులసి చెట్టుతో భవిష్యత్ కూడా తెలుసుకోవచ్చట. అది ఎలాగో తెలుసుకుందాం. తులసి చెట్టు ఆకులు, కొమ్మలు హఠాత్తుగా రాలిపోవడం,తులసి సహజ రంగును కోల్పోవటం వంటి సంకేతాలు భవిష్యత్ గురించి చెప్పుతాయి.

తులసి చెట్టు పచ్చగా కళకళలాడుతూ ఉంటే ఆ ఇల్లు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ ఇంటిలో ఎటువంటి సమస్యలు ఉండవు. తులసి చెట్టు పచ్చగా ఉంటే ఆ ఇంటిలో ఐశ్వర్యం ఉండటమే కాకుండా అదృష్టం కూడా కలిసి వస్తుంది.

తులసి చెట్టు ఆకులు ఒక్కసారిగా ఎండిపోవడం లేదా రాలిపోవడం జరిగితే ఆ ఇంటి యజమానికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు సంకేతం. తులసి ఆకులు రంగు మారితే ఆ ఇంటిలో ఎదో అనర్ధం జరుగుతుందని సంకేతం.

కాబట్టి తులసి చెట్టును భక్తితో పూజించటమే కాకుండా ఆ చెట్టులో వచ్చే మార్పులను కూడా గమనిస్తూ ఉండాలి.