'తులసి' వల్ల ఎన్నో ఉపయోగాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు    2017-10-17   21:49:10  IST 

హిందూ సంప్రదాయంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇందులో రెండు జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అని అంటారు. వీటిలో సాధారణంగా కృష్ణతులసిని పూజకు వాడుతారు. ఆయుర్వేద ఔషధాలలో కూడా కృష్ణతులసిని ఎక్కువగా వాడతారు. తులసిని పూజలలో ఉపయోగిస్తారు. అలాగే తులసిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. తులసిలో యాంటి ట్యూబర్‌క్యులర్‌, యాంటి బ్యాక్టీరియల్‌, యాంటి ఫంగల్‌, యాంటి వైరల్‌ గుణాలున్నాయి.