ప్రశించాడు... పీకేశారు ! గోవింద గోవిందా    2018-05-16   22:44:26  IST 

టీటీడీలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం రాజుకుంటూనే ఉంటోంది. మొన్నటివరకు టీటీడీ కొత్త పాలకవర్గం ఎంపికపై చెలరేగిన రగడ అంతా ఇంతా కాదు. టీడీడీ ఛైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్ క్రిస్టియన్ సభలకు వెళ్తాడు అటువంటి వ్యక్తికి ఛైర్మెన్ గిరి ఎలా కట్టబెడతారు అంటూ వివాదం చెలరేగింది. ఆ తరువాత అది సద్దుమణిగిపోయింది. ఇక అంతాక్ బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో మళ్ళీ టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేయడం సంచలనం రేపింది.

తిరుమల కొండపై టిటిడి అధికారులు ఆగమశాస్త్ర విరుద్ధంగా కార్యక్రమాలను నిర్వహించి ప్రకృతి విపత్తులకు కారణమవుతున్నారని రమణ దీక్షితులు ధ్వజమెత్తారు. అంతేకాదు శ్రీవారి ఆభరణాలకు సంబంధించిన లెక్కలను అధికారులు వెంటనే బహిర్గతం చేయాలని రమణదీక్షితులు డిమాండ్ చేయడం, చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న పాపాల వల్లే ప్రజల్లో అశాంతి నెలకొందని.. అధికార పార్టీ అండతో టీటీడీలో చాలా మహాపచారాలు జరుగుతున్నాయని మంగళవారం టీటీడీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు ఆరోపణలు గుప్పించడంతో ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగింది.