ఫ్రీ బస్ పాస్ ఫెసిలిటీ కల్పిస్తోన్న TSRTC..పాస్ ఎలా పొందాలంటే  

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠశాలల్లో సకల సదుపాయాలు కల్పించడంతోపాటు పుస్తకాలు, స్కూల్ యూనిఫాం, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టడంతోపాటు మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు సైతం అందిస్తున్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు విధ్యార్దులకు రవాణా సౌకర్యం అందించే విషయంపై దృష్టిపెట్టింది.అందులో భాగంగా దూరప్రాంతాల నుంచి విద్యాసంస్థలకు వెళ్లే విద్యార్థుల కోసం టీఎస్‌ఆర్టీసీతో బస్‌పాస్ సౌకర్యం కల్పిస్తుంది. ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా బస్‌పాసులు జారీ చేస్తోంది. 12 ఏండ్లలోపు బాలురకు, పదో తరగతి వరకు 18ఏండ్లు కల్గిన బాలికలకు ఉచితంగా బస్‌పాస్‌లు జారీ చేస్తోంది. మిగతా విద్యార్థులు నిర్దేశిత రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

బస్‌పాస్ ఫీజుల వివరాలు..

* కిలో మీటర్‌లోపు నెలకు రూ.85

* 2-8కిలో మీటర్లలోపు రూ.105

* 8-15 కిలో మీటర్ల వరకు రూ.135

* 15-20 కిలోమీటర్ల పరిధి వరకు రూ.180

* 20-25కిలోమీటర్ల వరకు రూ.225

* 25-30కిలో మీటర్ల వరకు రూ.250

* 35 కిలో మీటర్ల వరకు రూ.270

* బస్‌పాస్ రెన్యువల్ కోసం అదనంగా రూ.30 చెల్లించాల్సి ఉంటుంది.

15 రోజుల్లో పాస్ గడువు ముగిసే సమయానికి పునరుద్ధరించుకోవాలి. లేకుంటే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు ఈ బస్‌పాస్‌లను నెలవారీగా కాకుండా మూడు నెలలకు సరిపడా రుసుము చెల్లించి ఒకేసారి పొందవచ్చు.

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు..

బస్‌పాస్‌ల జారీ ప్రక్రియ ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం WWW.tsrtc pass.in వెబ్‌సైట్‌లో దరకాస్తు ఫారం పూర్తి వివరాలను నమోదు చేసిన తర్వాత వెబ్‌కెమెరా సాయంతో ఫొటోను సైతం జతచేయాలి. అనంతరం విద్యార్థి అడ్మిషన్ నంబర్‌తోపాటు రూ.30 సమీప బస్టాండ్‌లోని కౌంటర్‌లో అందజేస్తే బస్‌పాస్ జారీ చేస్తారు.