తెలంగాణాలో టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల !     2017-10-21   08:22:07  IST  Raghu V

TSPSC TS DSC TRT 2017 Notification Teachers Recruitment

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. టీఆర్టీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 8792 పోస్టులతో టీఆర్టీ నోటిఫికేషన్‌‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. స్కూల్‌ అసిస్టెంట్ పోస్టులు 1941, పీఈటీ పోస్టులు 416, స్కూల్‌ అసిస్టెంట్‌(ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) పోస్టులు 9, లాంగ్వేజ్‌ పండిట్ పోస్టులు 1011, ఎస్జీటీ పోస్టులు 5415లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

జిల్లాల వారీగా మొత్తం టీచర్‌ పోస్టులు
ఆదిలాబాద్‌ 293, మంచిర్యాల 169, నిర్మల్‌ 226, ఆసిఫాబాద్ జిల్లాలో 894, కరీంనగర్‌ 71, జగిత్యాల 253 పోస్టులు, పెద్దపల్లి 53, సిరిసిల్ల 76, నిజామాబాద్ 158, కామారెడ్డి జిల్లాలో 381, వరంగల్‌ అర్బన్ 22, వరంగల్‌ రూరల్‌ 23, భూపాలపల్లి 319 పోస్టులు,జనగాం 60, మహబూబాబాద్‌ జిల్లాలో 128, ఖమ్మం 57, భద్రాద్రి జిల్లాలో 185, మెదక్‌ 281, సంగారెడ్డి 903, సిద్దిపేట జిల్లాలో 101, మహబూబ్‌నగర్ 731, వనపర్తి 154, నాగర్‌కర్నూలు 385, గద్వాల 438, నల్గొండ 190, సూర్యాపేట 156, యాదాద్రి జిల్లాలో 128, వికారాబాద్ 820, మేడ్చల్‌ 199, రంగారెడ్డి జిల్లాలో 521, హైదరాబాద్‌లో 417 టీచర్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది