Trump’s obsession Kristen Stewart is getting into a lesbian marriage

ట్విలైట్ సీరీస్ ఇక్కడ చాలామందే చూసుంటారు కదా. ఆ సినిమాలు చూసుంటే “క్రిస్టెన్ స్టెవార్ట్” అనేది పరిచయం అక్కరలేని పేరు. ఇక తెలియనివారికి చెప్పాలి కాబట్టి, క్రిస్టెన్ స్టెవార్ట్ ప్రస్తుతం ఉన్న హాలివుడ్ యంగ్ క్రేజీ హీరోయిన్స్ లో ఒకరు. 20కి పైగా సినిమాలు చేసి మంచి పాపులారిటి, బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అదికూడ అలాంటి ఇలాంటి ఫాలోయింగ్ కాదు, ఒకానొక సమయంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఈ అమ్మడికి వీరాభిమాని. ఈ బ్యూటీ అంటే పడిచచ్చేవాడు. తనతో ఒక్కసారైనా సెక్స్ చేయాలని పరితపించేవాడట. ఇవేమి రూమర్లు కాదులేండి .. ఎందుకంటే స్వయంగా క్రిస్టెన్ ట్రంప్ చేష్టలను బయటపెట్టింది. మరి ప్రెసిడెంటు అవకుముందు ట్రంప్ చిన్నచితాక వ్యక్తా అంటే కాదు, అయినా ట్రంప్ ని పట్టించుకోలేదు క్రిస్టెన్.

ట్రంప్ ప్రెసిడెంటుగా ఎన్నికయ్యాక కూడా ట్రంప్ మీద తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు ఈ 26 ఏళ్ళ సుందరి. ఓ పెద్ద ట్విస్ట్‌ ఏంటంటే, ట్రంప్ కి స్వలింగ సంపర్కులు అంటే అసహ్యం, కాని క్రిస్టెన్ ఇప్పుడొక స్వలింగ సంపర్కురాలు. తన మాజీ బాయ్ ఫ్రెండ్ రాబర్ట్ పాటిన్సన్ ని వదిలేసిన తరువాత మళ్ళీ అబ్బాయిలని డేట్ చేయలేదు ఈ అమ్మడు. లెస్బియన్ గా మారి అమ్మాయిలతోనే చెట్టపట్టాలేసుకోని తిరిగింది. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక నిర్భయంగా తను ఒక లెస్బియన్ అని ప్రకటించింది. ఒక లెస్బియన్ వీడియో కూడా తీసి ట్రంప్ మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేసింది. అయినా ట్రంప్ క్రిస్టెన్ ని ఏమి అనలేదు. అదంతే లేండి … రాజులు కూడా కాంతదాసులే కదా. ఈ హీరోయిన్ తనకి దక్కకపోయినా, తనని అవమానిస్తున్నా, అన్ని భరిస్తున్నాడు అమెరికా ప్రెసిడెంటు.

ఇక క్రిస్టెన్ మిగితా అఫైర్స్ విషయానికి వస్తే ఐదారు నెలల క్రితం అలిసియా అనే గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ చేసుకున్న క్రిస్టెన్, అప్పటినుంచి స్టెల్లా మాక్స్‌వెల్ అనే మోడల్ తో ప్రేమలో ఉంది. ఇప్పుడు వీరిద్దరు పెళ్ళి చేసుకుందామనుకుంటున్నారు. సౌత్ కాలిఫోర్నియాలో వీరిద్దరి వివాహం అతి త్వరలో జరగబోతోంది.

అంతా బాగానే ఉన్నా, ఇంకా ట్రంప్ మీద పగ తగ్గలేదు. తమ వివాహాన్ని స్వలింగ సంపర్కులు ఆదర్శంగా తీసుకుంటారని, ఇది కొందరికి (ట్రంప్ కి) చెంప మీద కొట్టినట్లుగా అనిపిస్తుందని చెప్పుకొచ్చింది ఈ హాట్ హీరోయిన్. చూసారా ఈ అమ్మాయికి ఎంత ధైర్యమో .. ఏకంగా దేశ రాష్ట్రపతికి చుక్కలు చూపిస్తోంది. 2