'ఈబీ-5' మరింత ఖటినం     2018-09-10   14:55:38  IST  Bhanu C

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన నాటినుంచీ అమెరికాలోని ఎన్నారైలకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు వలస విధానంపై రోజు రోజు కి ఎంతో ఖటినంగా వ్యవహరిస్తున్నాడు..ఈ తీరుతో ఎన్నారైలు అనేక ఇబ్బందులకి గురవుతున్నా ట్రంప్ తన విధానంలో ఎటువంటి మార్పులు చేయడంలేదు సరికదా ఎన్నారైలకి ఇబ్బందులు కలిగేలా మరిన్ని చర్యలకి పాలపడుతున్నాడు..అందులో భాగంగానే హెచ్ 1 బీ పై ట్రంప్ చేపట్టిన చర్యలు అందరికీ తెలిసిందే అయితే తాజాగా ట్రంప్ కన్ను ఈబీ- 5 పై పడింది.

NRI,Telugu NRI Upadates,Trump Puts Major Restrictions On EB 5 Visa

ఒక మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా 10మంది అమెరికన్లకు ఉపాధి కల్పిస్తే, గ్రీన్‌కార్డును అమెరికా ప్రభుత్వం మంజూరు చేస్తుంది అయితే ఈ ఈబీ-5 విషయంలోనూ నిబంధనలకు కఠిన తరం చేయాలని ట్రంప్‌ ప్రభుత్వం అనుకుంటోంది…దీని కనీస పెట్టుబడిని 5మిలియన్‌ డాలర్లకు పెంచనున్నారని అమెరికన్‌ కాంగ్రెస్‌మెన్‌ ఆరోన్‌ స్కాక్‌ చెబుతున్నారు…అయితే వచ్చే ఏడాది జనవరి నుంచీ ఈ నిభందన అమలులో ఉంటుందని అధికారులు పేర్కొన్నట్టుగా తెలుస్తోంది..

NRI,Telugu NRI Upadates,Trump Puts Major Restrictions On EB 5 Visa

గత కొంత కాలంగా ఈబీ-5వీసాలను పొందే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ప్రతీ ఏటా 30-40 శాతం వృద్ధి నమోదవుతోందని వచ్చే 3-4నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది..అయితే ఈ వీసా విధానానికి సంభందించి యూకే 2మిలియన్‌ డాలర్లకు పెంచగా..కెనడా ఒక మిలియన్‌ డాలర్లకు..ఆస్ట్రేలియా 4 మిలియన్‌ డాలర్లకు పెంచిందని తెలిపారు. ఈబీ-5వీసా పొందే జాబితాలో భారత్‌మూడో స్థానంలో ఉంది సర్వేలు వెల్లడించాయి.