TRS MP Kavitha Operation Jagityal against BJP

తెలంగాణ‌లో ప‌ట్టుసాధించేందుకు బీజేపీ నేత‌లు ప‌క్కా వ్యూహంతో రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ త‌న‌య‌, ఎంపీ కల్వ‌కుంట్ల క‌విత ల‌క్ష్యంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. ఆమె ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నిజామాబాద్‌లో.. పాగా వేసేందుకు బీజేపీ అగ్ర నేత‌లు రంగంలోకి దిగుతున్నారు. బీజేపీకి ముందుగా ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాల నుంచి క్ర‌మ‌క్ర‌మంగా బ‌లోపేతం చేసేందుకు.. సాక్షాత్తూ బీజేపీ మాజీ అధ్య‌క్షుడు నితిన్ గ‌డ్క‌రీ రంగంలోకి దిగారు. ఇదే స‌మ‌యంలో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేంటంటే.. వారి వ్యూహాల‌ను ముందే ప‌సిగ‌ట్టిన క‌విత‌.. వారికి చెక్ పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌.

కల్వకుంట్ల కవిత 2014లో నిజామాబాద్‌ లోక్‌సభ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఢిల్లీలో యాక్టివ్‌గా ఉంటూనే నియోజకవర్గం అభివృద్ధి విషయంలో అంతే చురుకుగా ఉంటున్నారు. అయితే ఆమె నియోజక‌వ‌ర్గంపై బీజేపీ పూర్తిగా దృష్టిసారించింది. నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో భారతీయ జనతా పార్టీకి కొంత సానుభూతి ఉంది.. క్యాడరూ ఉంది.. ఇదే అదనుగా ఈసారి నిజామాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని ఎట్టి పరిస్థితులలో చేజార్చుకోకూడదన్న గట్టి నిర్ణయానికి బీజేపీ వచ్చింది.. దేశవ్యాప్తంగా 2014 ఎన్నికల్లో పరాజయం పాలైన స్థానాలపై బీజేపీ సీరియస్‌గా దృష్టి పెట్టింది.