బాత్ టబ్ లో త్రిష హాట్ వెట్ అందాలు..! చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!  

తెలుగు, తమిళ భాషల్లో త్రిష ఒక్కప్పుడు తిరుగులేని స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. హద్దులు దాటని గ్లామర్, అద్భుతమైన నటనతో త్రిష క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. చాలా కాలం పాటు సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ గా త్రిష కొనసాగింది. 35 ప్లస్ లో ఉన్న ఈ బ్యూటీకి సరైన అవకాశాలు రావడం లేదు. అందుకే గ్లామర్ డాల్, సీనియర్ హీరోయిన్ త్రిష ‘మోహిని’ అవతారం ఎత్తింది. పగతో రగిలిపోతూ ప్రేక్షకుల్ని భయపట్టేందుకు ‘మోహిని’గా రాబోతుంది.

నాయకి తర్వాత త్రిష ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా తమిళ చిత్రం మోహిని. ఆర్. మాదేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఎన్నో వేల సంవత్సరాలుగా పూడ్చి పెట్టబడిన నిజం అంటూ వచ్చే సంభాషణలతో ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. హారర్‌ కామెడీ జోనర్‌ లో వస్తున్న తాజా చిత్రంతో త్రిష మరోసారి భయపెట్టేందుకు వస్తోంది.

‘మోహిని’ సినిమాకు ప్రచారం కల్పించేందుకు అందులో త్రిష స్టిల్స్ ను వెబ్‌లోకి వదిలారు దీని రూపకర్తలు. బాత్ టబ్ లో హాట్ అందాలు వల్కపోస్తుంది. త్రిష ఏ మేరకు ప్రేక్షకులను థియేటర్లను ఆకర్షించగలదో చూడాలి!