నిరుపేద తండ్రికూతుర్లు.. వేగంగా వస్తున్న రైలుకెదురుగా నిలబడి.. రెండువేల మంది ప్రాణాలు కాపాడారు..     2018-08-19   14:09:03  IST  Rajakumari K

కేరళ వరదల్లో ఒక్కొక్కరిది ఒక్కో కథ..వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి 5000మందికి పై ఎన్డీఆర్ఎఫ్ సైన్యం పనిచేస్తుంటే సామాన్యులు సైతం తమ వంతు సాయం చేస్తున్నారు..తాజాగా ఇద్దరు తండ్రి కూతుర్లు వారి ప్రాణాలకు తెగించి రెండువేల మంది ప్రాణాలను రక్షించాడు.వారే లేకపోయుంటే ఎంత పెద్ద దుర్ఘటన జరిగేదో..

త్రిపురలోని ధలాయ్ జిల్లాలోని అతరాముల అటవీ ప్రాంతంలోని ఎత్తయిన కొండలపై స్వపన్ దేబ్‌బర్మ అనే గిరిజన వ్యక్తి అతని కూతురు సోమతి.. అటవీ ఉత్పత్తులను ఓ మూటలో కట్టుకుని మెల్లిగా కొండ దిగుతున్నారు.. దూరంగా రైలు వస్తోంది. రోజూ వచ్చేదేగా అని మొదట పట్టించుకోలేదు. అయితే రైలు కొంచెం కొంచెం దగ్గరికొస్తుండగా స్వపన్ దూరంగా ఒకటి గమనించాడు… రైలు ముందు వచ్చే మార్గంలో ముందు పట్టాలు కనిపించడం లేదు. ముందు రోజు రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడ్డంతో పట్టాలు దూరంగా జరిగిపోయాయి.. ఎదురుగా రైలొస్తోంది..ఒక క్షణం పాటు ఏం చేయాలో పాలుపోలేదు..కానీ స్వపన్ ఆలస్యం చేయకుండా తన చేతిలో ఉన్న వస్తువులను కింద పడేసి పరుగుపరుగునా కొండ దిగేశాడు.తండ్రి వెంటే కూతురూ పరిగెత్తుకొచ్చింది. దిగేసింది.

Saved Lives,somethi,swapan,Tripura Father-Daughter

తన చొక్కా విప్పి వస్తున్న రైలు ముందు నిలుచున్నాడు..ఆ చొక్కా పైకెతి పట్టుకుని ఊపుతున్నాడు.. తండ్రిని అనుసరిస్తున్న చిన్నారి సోమతి కూడా తన చేతిలోని గుడ్డను పైకెత్తి ఊపుతుంది..ట్రైన్ కి ఎదురుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని గమనించిన డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు ..కరెక్ట్ గా తండ్రి ,కూతుర్ల ముందుకొచ్చి బండి ఆగింది..వెంటనే కిందికి దిగి ఆరాతీస్తే విషయం తెలుసుకుని అందరూ ఆ తండ్రి కూతుర్లను ప్రశంసిస్తున్నారు..తండ్రి కూతుర్లు చేసిన పనికి రైల్లోని 2వేల మంది ప్రయాణికుల ప్రాణాలు నిలిచాయి.

Saved Lives,somethi,swapan,Tripura Father-Daughter

స్వపన్, సోమతిల ధైర్యసాహసాలను ప్రయాణికులు వేనోళ్లా కొనియాడారు. ప్రాణాలకు తెగించి తమను కాపాడారని అభినందించారు ఆ తండ్రీకూతుళ్లు ఎదురుగా లేకపోయుంటే బ్రేక్ వేసేవాడిని కానని, వారి వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని డ్రైవర్ సోనూ కుమార్ మండల్ చెప్పారు. నిరుపేద అయిన స్వపన్.. కొండల్లో కాయలు, జిగురు సేకరించి వాటిని అమ్ముకుని జీవిస్తుంటాడు. పిల్లలను బాగా చదివించాలని ఉందని, అయితే తనకు అది సాధ్యమయ్యేలా లేదని చెబుతున్నారు.తను చేసిన మంచే తనకు తిరిగి లభిస్తుంది. . విషయం రైల్వే శాఖకు తెలిసింది. వారికి నగదు అవార్డు ఇస్తామని ప్రకటించారు.