Treatment Options for Swollen Eyelids

సాదారణంగా కన్ను రెప్ప మీద కురుపు అనేవి రహస్య గ్రంథులకు ఇన్ఫెక్షన్ రావటం వలన సంభవిస్తాయి. ఇవి రావటానికి అంతర్గత కారకాలు లేదా బాహ్య కారకాలు కారణం కావచ్చు. కంటి రెప్ప మీద కురుపు వేసినప్పుడు దురద, ఎరుపు, కంటి మీద చిన్న ఎరుపు చుక్క వంటి లక్షణాలు కనపడతాయి. ఈ కంటి కురుపును తగ్గించుకోవటానికి అనేక సులభమైన మరియు ప్రభావవంతమైన నివారణలు ఉన్నాయి.

1. గోరువెచ్చని నీరు

ఇది కంటి రెప్ప మీద కురుపు చికిత్సలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే వేగంగా మరియు తక్షణ ఉపశమనం పొందడానికి ఈ నివారణను ప్రయత్నించవచ్చు.

కావలసినవి
శుభ్రమైన పలుచని క్లాత్
గోరువెచ్చని నీరు – 1 కప్పు

పద్దతి

గోరువెచ్చని నీటిలో పలుచని క్లాత్ ని ముంచి నీటిని పిండి, కురుపు ఉన్న కనురెప్పను మూసి దాని మీద ఆ క్లాత్ ని పది నిముషాలు ఉంచాలి. ఈ ప్రక్రియను రోజుకి నాలుగు సార్లు ఇన్ఫెక్షన్ తగ్గేవరకు చేయాలి. ఈ సులభమైన మరియు సమర్థవంతమైన పరిష్కారం కంటి మంటను తగ్గించటంలో కూడా సహాయపడుతుంది.

2. జామ ఆకులు

జామ ఆకులు కంటి కురుపు చికిత్సలో సులభంగా మరియు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగే కంటి నొప్పి కూడా వేగంగా తగ్గుతుంది.

కావలసినవి
జామ ఆకులు – 2-3
నీరు – 1 కప్పు
శుభ్రమైన తెల్లని పలుచని వస్త్రం

పద్దతి
నీటిని బాగా మరిగించి దానిలో జామ ఆకులను వేసి పది నిముషాలు మరిగించాలి. ఈ జామ ఆకుల నీరు గోరువెచ్చగా అయ్యాక, దానిలో పలుచని క్లాత్ ని ముంచి నీటిని పిండి, కురుపు ఉన్న కనురెప్పను మూసి దాని మీద ఆ క్లాత్ ని ఐదు నిముషాలు ఉంచాలి. ఈ ప్రక్రియను రోజుకి నాలుగు సార్లు ఇన్ఫెక్షన్ తగ్గేవరకు చేయాలి.