Top Tollywood Celebs in Drugs Scandal

హైద‌రాబాద్‌లో ఎప్పుడూ డ్ర‌గ్స్ ముఠాల గుట్టు ర‌ట్టు అయినా ముందుగా టాలీవుడ్ పేరు బ‌య‌ట‌కు వ‌స్తోంది. టాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసే ముఠాల‌కు చాలా పెద్ద పెద్ద లింకులే ఉన్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా కొద్ది రోజుల క్రితం హైద‌రాబాద్‌లో పోలీసుల దాడుల్లో ప‌ట్టుబ‌డ్డ డ్ర‌గ్స్ ముఠాను విచారిస్తుంటే వారికి టాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు చాలా కీల‌క సంబంధాలు ఉన్న‌ట్టు వెల్ల‌డైంది.

ఈ కేసును విచారించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం టాలీవుడ్‌లో ప‌లువురికి నోటీసులు పంపిన‌ట్టు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న వారిలో ముగ్గురు యంగ్ హీరోలు.. ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు నిర్మాతలు, ఇద్దరు డైరెక్టర్లు, ఒక కొరియోగ్రాఫర్, ఒక స్టంట్ మాస్టర్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. వీరు వ‌చ్చే ఆరు రోజుల్లో ఎప్పుడైనా విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఎక్సైజ్ శాఖ డైరెక్ట‌ర్ అకున్ స‌బ‌ర్వాల్ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్న‌ట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ప‌ట్టుబ‌డ్డ వారి పేర్లు రాసేందుకు ఏ మీడియా సాహ‌సించ‌డం లేదు. అయితే టాలీవుడ్ ఇంట‌ర్న‌ల్ చ‌ర్చ‌ల్లో మాత్రం వారి గురించి చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

– బాల‌న‌టుడిగా కెరీర్ స్టార్ట్ చేసి త‌ర్వాత సినిమా రంగం న‌చ్చావులే అంటూ ఒక‌టి రెండు హిట్లు కొట్టి ఇప్పుడు వ‌రుస ప్లాపుల‌తో డీలా ప‌డ్డ హీరో డ్ర‌గ్స్‌కు బాగా బానిస అయ్యాడ‌ట‌.