రాజమౌళి కాపి కొట్టిన టాప్ సినిమాలు / సీన్స్  

కాపి అంటే కొంచెం నాటుగా ఉంటుందేమో .. స్ఫూర్తి పొందడం అంటే కొంచెం క్లాస్ గా ఉంటుందేమో. ఏదైతే ఏమి .. రాజమౌళి సినిమాల్లో అన్ని పూర్తిగా ఒరిజినల్ ఆలోచనలు మాత్రం ఉండవు. కొంచెం తన సొంత క్రియేటివిటి ని, ఇంకొంచెం స్ఫూర్తి పొందిన అంశాలను కలిపి మనకు నచ్చేలా రుబ్బి రుబ్బి వడ్డించడం జక్కన్న స్పెషాలిటి. సో, ఈరోజు మన రాజమౌళి కాపి కొట్టిన లేదా స్పోర్తి పొందిన కొన్ని సినిమాలు/ సీన్స్ ఏంటో చూద్దాం.

* బాహుబలితో మొదలుపెడితే .. క్లయిమాక్స్ లోని యుద్ధ సన్నివేశంలో కాలకేయుల నాయకుడు తన మనుషులలో కొందరిని బాహుబలి మీదికి విసురుతాడు. వారంతా బాహుబలి మీద కుప్పలు కుప్పలుగా పడిపోతారు. కాని బాహుబలి తన బలాన్ని చూపించి పైకి లేవగానే వారంతా చెల్లాచెదురుగా పడిపోతే, బాహుబలి చేతిలో సింహం తల ఆకారంలో ఓ ఆయుధం ఉంటుంది.

ఇప్పుడు ఈ విడియోని 1:30 నిమిషాల దగ్గరినుంచి చూడండి. గాడ్ ఆఫ్ వార్స్ విడియో గేమ్ నుంచి తీసుకున్న షాట్ అది.

* బాహుబలి గురించి ఇంకొంచెం మాట్లాడుకుంటే … రెండోవభాగంలోని యుద్ధసన్నివేశంలో భాల్లాలదేవుడు శివుడి మీదకి తన రథంతో దూసుకువస్తోంటే, బాహుబలి తన చేతిలో ఆయుధంతో ముందున్న చక్రాలను విరగొట్టి, దున్న మీద అడుగుపెట్టి భాల్లాలుడి వైపు ఆయుధాన్ని ఎక్కుపెడతాడు. మనల్ని ఎంతగానో అలరించిన ఈ షాట్ ని మహాభారతానికి గుర్తుగా చెక్కిన కర్ణుడి విగ్రహ నమూనా నుంచి తీసుకున్నారు.