ఇండియాలో దెయ్యాలు తిరిగే అతి భయంకరమైన ప్రదేశాలు

మన ప్రపంచం లో చాలా వింతలు విశేషాలు ఉన్నాయి. అందరికి కొన్ని కలలు ఉంటాయి కనీసం ఒక్కసారైనా ప్రపంచం అంతా తిరిగి రావాలని కానీ డబ్బు వల్లనో సమయం లేకపోవడం వల్లనో మనం అన్ని చూడలేం , వింత ప్రదేశాలు అనగానే గుర్తొచ్చేవి ప్రపంచం లో ఏడూ వింతలు. ఈ వింతలు కాకుండా మన ప్రపంచంలో భయంకరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి కొందరికి ఆ ప్రదేశాల పేర్లు చెప్పిన భయం వేస్తోంది. అలాంటి ప్రదేశాలు మన భారత దేశం లోను ఉన్నాయి . ఆ ప్రదేశాలలో దెయ్యాలు భూతాలు తిరుగుతాయి అని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. నిజంగా దెయ్యాలు ఉన్నాయో లేవో మనకు తెలియదు కాని చాలా మంది ఆ ప్రదేశాలకు వెళ్లాలన్న ధైర్యం కూడా చేయరు. భారత దేశం లో చాలా ప్రదేశాలను దాని చరిత్ర మరియు కొన్ని సంఘటనల ఆధారంగా ఒక హంటెడ్ ప్రదేశంగా లెక్కిస్తారు. పారనార్మల్ నిపుణులు కూడా మన దేశంలో కొన్ని హాంటెడ్ ప్రదేశాలు ఉన్నాయని అంగీకరించారు.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

#1.భాంగ్రా కోట – రాజస్థాన్

హంటెడ్ ప్రదేశం అనగానే రాజస్థాన్ ప్రజలకు వినిపించే పేరే భాంగ్రా ఫోర్ట్ .ఇది రాజస్థాన్ లోని ఆళ్వార్ జిల్లాలో ఉంది.భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలలో భాంగ్రా కోట ముందుంటది. ఈ కోట పైన చాలా రకాల కథలు ఉన్నాయి.ఈ కోట బయట ప్రవేశ ద్వారం వద్ద ఒక హెచ్చరిక బోర్డ్ కూడా ఉంటుంది.మీరు గనుక ఇండియా లో హంటెడ్ ప్రదేశాలకి వెల్లలనుకుంటే భాంగ్రా కోటాని మిస్ కాకండి.