ఈ సీజ‌న్‌లో ఖ‌ర్బూజ పండును తినాలి....ఎందుకో తెలిస్తే మానకుండా తింటారు     2018-03-14   23:18:54  IST  Lakshmi P

Top Health Benefits of Muskmelon (Kharbuja)

వేసవి కాలం మొదలైందంటే ఖ‌ర్బూజ పండ్లు బాగా విరివిగా దొరుకుతాయి. ఇవి రుచిలో చప్పగా ఉన్నా వేసవి తాపం తగ్గటానికి ఖర్భుజ పండ్ల ముక్కలపై పంచదార, ఉప్పు, కారం వంటివి జల్లుకొని తింటారు. కొంత మంది జ్యుస్ చేసుకొని త్రాగుతారు.ఖ‌ర్బూజను ఏ రూపంలో తీసుకున్న సరే మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ వేసవి సీజన్ లో ప్రతి రోజు ఒక కప్పు ఖ‌ర్బూజ పండ్ల ముక్కలను తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం.

ఖ‌ర్బూజ పండులో విటమిన్ A సమృద్ధిగా ఉండుట వలన కంటి సమస్యలను దూరం చేసి కంటి చూపు బాగుండేలా చేస్తుంది.

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటంతో ఇన్‌ఫెక్ష‌న్లు తగ్గి వ్యాధులు రాకుండా ఉంటాయి.

ఖ‌ర్బూజ పండులో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. దాంతో హై బీపీ తగ్గుతుంది.. గుండె సమస్యలు ఉన్నవారికి ఈ పండు దివ్య ఔషధం అని చెప్పవచ్చు.