ఈ ఆహారాలు మీ డైట్ లో ఉంటే, రోగనిరోధకశక్తి 3 రేట్లు పెరుగుతుంది  

రోగనిరోధకశక్తి, అంటే Resistance Power లేదా Immunity Power. ఇది ఒంట్లో మంచి మోతాదులో ఉంటేనే మీ శరీరంపై మీకు కంట్రోల్ ఉంటుంది. లేదంటే తుమ్మితే కూడా ఏదో ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు వేసవి నడుస్తోంది, కొందరు చిన్నిపాటి ఎండకు వెళ్ళగానే, వడదెబ్బ తగిలి మంచం మీద పడతారు. రాబోయేది వర్షకాలం. ఇంఫెక్షన్స్ బెడద ఎక్కువ ఉంటుంది. వాతావరణం లో మార్పులు చాలా సహజం. జ్వరం, జలుబు లాంటి సమస్యలు సర్వసాధారణం. అయితే, కొందరి శరీరాలు ఎంత బలహీనంగా ఉంటాయంటే, వారిని ఒక ఇంఫెక్షన్ పట్టుకుందా అంటే అంత సులువుగా వదలదు. వారాలపాటు ఇబ్బందిపడుతూనే ఉంటారు. మరోవైపు మరో చాలా సులువుగా కొలుకుంటాడు, లేదంటే అంత సులువుగా, జ్వరాల బారిన పడడు. ఈ తేడాలకు కారణం, రోగనిరోధకశక్తి లో ఉండే తేడాలు. మరి రోగనిరోధకశక్తి పెరగాలంటే ఏం చేయాలి? ఏం తినాలి?

Antioxidants ఉండే ఆహారపదార్ధాలు ఎక్కువగా తినాలి‌‌. యాంటిఆక్సిడెంట్స్ రోగనిరోధకశక్తి ని పెంచి, చిన్న చిన్న ఇంఫెక్షన్స్ లు మాత్రమే కాదు, క్యాన్సర్, షుగర్ లాంటి పెద్ద పెద్ద సమస్యలు కూడా శరీరాన్ని ఆక్రమించకుండా కాపాడుతాయి. మరి యాంటిఆక్సిడెంట్స్ శరీరానికి అందేదెలా? ఎలాంటి ఆహారపదార్ధాల్లో ఇవి ఎక్కువగా లభిస్తాయి?