Top 8 indian films banned by censor board

షారుఖ్ ఖాన్ నటించిన జబ్ హ్యారి మెట్ సజల్ అనే సినిమాలో “ఇంటర్ కోర్స్” అనే పదం వాడినందుకు ఎంతపెద్ద వివాదం పుట్టుకొచ్చిందో మీరు చూస్తూనే ఉన్నారు. సెన్సార్ బోర్డు లక్షమంది ఒక పోల్ లో పాల్గొని ఈ పదాన్ని ఉపయోగించవచ్చు అని చెబితేనే దీనికి అనుమతిని ఇస్తామన్నారు. లక్షమందికి పైగా దీనికి అనుకూలంగా ట్విట్టర్ లో ఓట్లు వేసారు. అయినా సెన్సార్ మొండితనం తగ్గలేదు. ఇది జస్ట్ సంపుల్ మాత్రమే. గతంలో ఎన్నోసార్లు మన సెన్సార్ బోర్డు పెద్ద పెద్ద షాకులు ఇచ్చింది. అలా బ్యాన్ చేసిన టాప్ 8 భారతీయ సినిమాలేంటో చూడండి.

* Fire (1996) :

బ్యాన్ చేసిన చిత్రాల్లో అత్యంత పాపులర్ చిత్రం ఇది. దీన్ని శివసేన నాయకులు వ్యతిరేకించారు. కారణం, ఒక లెస్బియన్ ప్రేమను చూపించడమే. షబానా ఆజ్మీ, నందిత దాస్ లాంటి పెద్ద నటీమణులు ఇందులో స్వలింగ సంపర్కులుగా నటించారు. ప్రపంచప్రఖ్యాత దీప మెహత దర్శకత్వం వహించగా, ప్రపంచం నలుమూలల పేరు సంపాదించిన ఈ సినిమా ఇండియాలో మాత్రం బ్యాన్ లిస్టులో ఉంది.

* Kaamasutra (1996):

కామసూత్రం పుట్టిందే ఇండియాలో. ఆ కామసుత్రంలోని సూత్రాల మీదే ఒక బోల్డ్ సినిమా తీస్తే మాత్రం, ఇలాంటి అశ్లీల చిత్రం ఇండియాలో వద్దు అంటూ బ్యాన్ చేసేసారు. విచిత్రం కదూ.

* Sins (2005):

ఒక మతపెద్ద ఓ అమ్మాయి ఆకర్షణలో ఎలా పడ్డాడు, మతపెద్ద ఇలానే ఉండాలి అనే సమాజం విధించిన కొన్ని లిమిటేషన్స్ తనపై ఎలాంటి ప్రభావాన్ని చూపించాయి .. ఈ కాన్సెప్ట్ మీదే వచ్చింది ఈ సినిమా. నగ్నసన్నివేశాల సాకు చూపి, మతం విలువలు అంటూ బ్యాన్ చేసారు.