ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యం కలిగిన అయిదు దేశాలు - వాటి బలగం

మనం తెల్లారి నిద్రలేచి మన పనులు చేసుకుంటున్నాం. రాత్రి ఎలాంటి భయం లేకుండా సుఖంగా నిద్రపోతున్నాం. ఈ జీవితం ఇంత సురక్షితంగా ఉంది అంటే దానికి కారణం, మన సైన్యం. మీకు తెలుసో లేదో కాని, మన భారత సైన్యం ప్రపంచంలోనే మూడోవ అతిపెద్దది. అలాగే శక్తివంతమైన సైన్యం కలిగిన దేశాల్లో నాలుగోవ స్థానం మన దేశానిది. అధునాతన మిసైల్స్ మన ఆస్తి. అందుకే యుద్ధానికి వచ్చిన పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. గొడవకు దిగిన చైనా సర్దుకుంది. అందుకే గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకుల ప్రకారం ఇండియన్ ఆర్మీ ప్రపంచ ర్యాంకు నాలుగు.

అయితే, అమెరికా దగ్గర ఉన్న టెక్నాలజీ, అస్త్రాల ముందు మిగితా దేశాలు చిన్నగానే కనిపిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీ అమెరికా సొంతం. $689 బిలియన్ల బడ్జెట్ అమెరికా సైన్యానికి కేటాయిస్తుంది. ఈ బడ్జెట్ దరిదాపుల్లోకి, చైనాతో కలిపి ఏ దేశం రాలేదు. అన్ని రకాల వసతులు, శక్తివంతమైన అస్త్రాలు వీరి సొంతం. చైనా కన్నా సైనికుల జనాభా తక్కువే అయినా, అమెరికా సైనిక శక్తి ఇప్పట్లో మరో దేశం అందుకోలేనంత ఎత్తులో ఉంది.