Top 10 most beautiful cricketers in the world

మహిళా ప్రపంచకప్ ముగిసింది. ఎన్నడు లేనిది, జనాలు మహిళా క్రికెట్ ని టీవిలకు అతుక్కుపోయి చూసారు. దురదృష్టం కొద్ది మన భారత జట్టు ఫైనల్ లో ఓడిపోయినా, వంద కోట్ల మనసులు గెలుచుకున్నారు. మరి ఇటు ఆటతో పాటు, తమ అందంతో కుర్రాళ్ళ మనసుల్ని గెలుచుకుంటున్న టాప్ 10 క్రికెట్ అందగత్తెలు ఎవరో చూస్తారా ?

10. Nuzhat Parween :

కొత్తగా భారత జట్టులోకి వచ్చింది. గత ఏడాది టీ20లలో డెబ్యూ చేసిన ఈ 21 ఏళ్ల అమ్మాయి, ఈ ఏడాది మేలో వన్డే టీమ్ లో చోటు దక్కించుకుంది. కాని పాపం, ప్రపంచ కప్ కు సెలెక్ట్ అయినా, ఒక్క మ్యాచు కూడా ఆడే అవకాశం రాలేదు. కారణం, జట్టులో సుష్మ వర్మ రూపంలో ఓ సీనియర్ వికెట్ కీపర్ ఉండటం.

9. Mithali Raj :

మన హైదరాబాద్ అమ్మాయి. వుమెన్ క్రికెట్ దిగ్గజం. మహిళల క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించిన ఘనత ఈ ప్రపంచకప్ లోనే సొంతం చేసుకుంది మన భారతీయ మహిళా జట్టు సారధి. 1999లో సంవత్సరంలో జట్టులోకి వచ్చిన మిథాలి, 2005 మరియు 2017 ప్రపంచకప్ లో జట్టుని ఫైనల్ దాకా తీసుకెళ్ళింది.

8. Sana Mir :

31 ఏళ్ల ఈ పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం 2005లో జట్టులోకి వచ్చింది. మంచి ఆల్ రౌండర్ అయిన సనా మీర్ కుడి చేతితో బ్యాటింగ్ చేస్తుంది, కుడి చేతితో ఆఫ్ స్పిన్ వేస్తుంది. 2010 మరియు 2014 సంవత్సరాల్లో జరిగిన ఆసియా గేమ్స్ లో పాకిస్తాన్ రెండుసార్లు గోల్డ్ మెడల్ సాధిస్తే, ఆ రెండు సార్లు జట్టుకి నాయకత్వం వహించింది సనానే. ఈ ప్రపంచకప్ కూడా సనా సారథ్యంలోనే ఆడింది పాకిస్తాన్ జట్టు.

7. Meg Lanning :

ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్. ఈవిడని మెగాస్టార్ మెగ్ లానింగ్ అని అంటారు. మరి ఆట అలా ఉంటుంది. మహిళ క్రికెట్ లో విరాట్ కోహ్లీ మాదిరి అన్నమాట. అన్ని రికార్డులు బుట్టలో వేసుకుంటోంది. ఇప్పటికే తనని ఓ దిగ్గజం అని అంటున్నారు.