Top 10 highest earning cricketers in the world right now

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు ఏది అంటే వెంటనే భారత క్రికెట్ బోర్డు అని చెప్పేస్తారు. మరి అత్యధిక సంపాదన గల టాప్ క్రికెటర్స్ అంతా భారతీయులేనా ? అసలు టాప్ 10 ఎవరెవరు ఉన్నారు ? ఇండియా నుంచి ఎంతమంది ఉన్నారు ? ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక సంపాదన కలిగిన క్రికెటర్ ఎవరు ? అన్ని సమాధానాలు మా దగ్గర ఉన్నాయి. అత్యధిక సంపాదన కలిగిన టాప్ 10 క్రికెటర్స్ ఎవరో .. వారు ఎంత సంపాదిస్తున్నారో చూడండి.

10. షేన్ వాట్సన్ :

రిటైర్ అయిపోయాడు కాని, ఇంకా లీగ్స్ ఆడుతున్నాడు. ఐపిఎల్ ఒకటే కాదు, పాకిస్తాన్ సూపర్ లీగ్, కరిబిఎన్ లీగ్ .. ఇలా తేడా లేకుండా ఆడుతున్నాడు. ఐపిఎల్ లో పోల్చుకుంటే మిగితా లీగ్స్ లో వచ్చేది చిల్లరే అయినా, షేన్ వాట్సన్ ఇంకా సంపాదిస్తున్నాడు. ఇతడి వార్షిక ఆదాయం 11 కోట్లు.

9. స్టీవ్ స్మీత్:

ప్రపంచ అగ్రేశ్రేణి బ్యాట్స్ మెన్ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్ళ లిస్టులో చివరి ర్యాంకులో ఉన్నాడు. తానే సారధి అయినా, తనకన్నా ఎక్కువ సంపాదించే వారు తన జట్టులోనే ఉన్నారు. ఐపియల్ లో పూణే జట్టుకి సారధ్యం వహించే ఈ టాప్ బ్యాట్స్ మెన్, తన ఆదాయంలో అధిక శాతం లీగ్ ద్వారానే పొందుతాడు. ఇతడి వార్షిక ఆదాయం 16 కోట్ల పైన ఉంది.

8. గౌతమ్ గంభీర్ :

భారత జట్టులో గంభీర్ కి చోటు దక్కట్లేదు. అయినా టాప్ 10 లో ఉన్నాడంటే కారణం ఐపిఎల్. కోల్కతా నైట్ రైడర్స్ సారధి కావడంతో షారుఖ్ ఖాన్ గంభీర్ కి పెద్ద మొత్తమే చేల్లిస్తాడు. ఇతని ఆదాయం కూడా ఏడాదికి 16 కోట్ల పైనే.