టాలీవుడ్ లో అందరికంటే “రిచ్” హీరో ఎవరో తెలుసా.? స్టార్ హీరో కాదు, రెమ్యూనరేషన్ ఎక్కువ కాదు!     2018-05-31   00:52:00  IST  Raghu V

సచిన్ జోషి హీరోల్లో అత్యంత ధనవంతుడు..తిప్పి కొడితే ఇతను చేసిన సినిమాలు ముచ్చటగా మూడు అప్పట్లో మౌనమేలనోయి,ఒరేయ్ పండు, నిను చూడక నేనుండలేను. ,ఈ మధ్య ఒకటి నీ జతగా నేనుండాలి.మరో రెండు సినిమాలు చేసాడు అవి ఇలా వచ్చి అలా వెళ్లిపోయి వాటి పేర్లు కూడా ప్రేక్షకులకు తెలీదు..మరి లక్షలు లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారికంటే ఇతను ఎలా ధనవంతుడు అనుకుంటున్నారా..సచిన్ హీరో అవ్వడానికన్నా ముందు పెద్ద బిజినెస్ మాన్..

ఎంత పెద్ద బిజినెస్ మాగ్నట్ అంటే మార్నింగ్ టిఫిన్ లండన్ లో చేసి, లంచ్ చేయడానికి ఫారిన్ వెళ్లి,ఎప్పుడు ఎక్కడ ఏ దేశంలో ఉంటాడో తనకే తెలియని పరిస్తితి..ఈ పాటికే మీకు సీన్ మొత్తం అర్దం అయిపోయుంటుంది కదా..ఈ మధ్య కింగ్ ఫిషర్ విల్లాను కొనుకున్నది కూడా ఈ సచిన్ జోషినే..ఇంతకూ కింగ్ ఫిషర్ విల్లా ఎంత పెట్టి కొనుక్కున్నాడో తెలుసా అక్షరాల 73 కోట్ల రూపాయలకు..