కేరళ వరద బాధితులకు మన హీరోలు ఎవరెంత ఇచ్చారో తెలుసా.?     2018-08-19   09:20:40  IST  Sainath G

కేరళను వర్షం కుదిపేసింది. గత వారం రోజులుగా వరద ముంచెత్తుతోంది. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఇప్పటివరకు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు విరాళాలు అందించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పిలుపునిచ్చారు.

Funds For Kerala,Kerala Flood Relief Funds,Ram Charan,Tollywood Hero's,Vijay Devarakonda

కేరళలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులకు కోసం తెలంగాణ ప్రభుత్వం తరఫున సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, అధికారులను శనివారం ఆదేశించారు. విజయ్ డెయిరీ నుంచి రూ.40లక్షల విలువైన 20 టన్నుల పాలపొడి పంపేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు ఇవాళ 20 టన్నుల పాలపొడి కేరళకు పంపనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణ తరఫున కేరళకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

Funds For Kerala,Kerala Flood Relief Funds,Ram Charan,Tollywood Hero's,Vijay Devarakonda

భారీవర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న కేరళను ఆదుకునేందుకు నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ ఆధ్వర్యంలో ఆహారపదార్థాలను ఇవాళ కేర‌ళ‌కు పంపారు . చిన్నారుల కోసం 100 మెట్రిక్ టన్నుల పౌష్టికాహారాన్ని పంపారు. దాదాపు రూ 52.50 లక్షల విలువైన ఈ ఆహారపదర్థాలను బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి రక్షణశాఖకు చెందిన విమానం ద్వారా శనివారం ఉదయం 7.30 గంటలకు తరలించారు.

Funds For Kerala,Kerala Flood Relief Funds,Ram Charan,Tollywood Hero's,Vijay Devarakonda

అంతేకాదు మన హీరోలు కూడా సరైన సమయంలో స్పందించారు. చేయూతను అందించారు. ‘కేరళ ప్రజలు నాపై చూపిన అమితమైన ప్రేమ, అభిమానం.. నా హృదయంలో వారికి ప్రత్యేక స్థానాన్ని ఏర్పరిచింది. వారి కోసం నా వంతుగా సాయం చేయాలి అనుకుంటున్నా’’ అని 25 లక్షలు ఇస్తున్నట్లు హీరో అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశారు.

రామ్ చరణ్ తేజ్ 25 లక్షలు విరాళంగా అందించారు. పది టన్నుల రైస్ ని కూడా పంపించారు.హీరో విజయ్‌ దేవరకొండ కూడా తన వంతుగా సాయం చేసేందుకు ముందుకొచ్చారు. రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు.‘గీత గోవిందం’ సినిమా వసూళ్లను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందిస్తామని చిత్ర నిర్మాత బన్నీ వాసు తెలిపారు.

హీరోలు మాత్రమే కాకుండా డైరక్టర్ కొరటాల శివ కూడా మూడు లక్షలు అందజేశారు. ఎనర్జిటిక్ హీరో రామ్ ఐదు లక్షల విరాళం అందించారు.