సోషల్ మీడియాలో లీకైన చికాగో సెక్స్ రాకెట్ అఫిడవిట్.! లిస్ట్ లో 10 మంది హీరోయిన్లు, యాంకర్లు?     2018-06-21   23:23:23  IST  Raghu V

అమెరికాలోని చికాగో కేంద్రంగా తెలుగు దంపతులు మోదుగుమూడి కిషన్- చంద్రకళ నడిపిస్తున్న సెక్స్ రాకెట్ భాగోతం బయటపడిన తర్వాత పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.ఈ దందాలో పలువురు తెలుగు, కన్నడ హీరోయిన్లు ఇన్వాల్వ్మెంట్ ఉందని, కొందరు డబ్బు కోసం, మరికొందరు బలవంతంగా ఇందులోకి దిగినట్లు తెలుస్తోంది. కిషన్ దంపతులు అమెరికాలో తెలుగు ఈవెంట్ల పేరుతో ఇక్కడకు హీరోయిన్లను రప్పించి గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఈ వ్యహారంలో బాధితురాలుగా ఉన్న హీరోయిన్ (విక్టిమ్-ఎ)పై అమెరికా ఐదేళ్ల నిషేధం విధించినట్లు సమాచారం.

సెక్స్‌ రాకెట్‌ కేసు రోజుకో కొత్తమలుపు తిరుగుతోంది. అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యురిటీ సాగిస్తున్న దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరికొందరిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి అమెరికా పోలీసులు స్థానిక కోర్టులో దాఖలు చేసిన 40 పేజీల అఫిడవిట్‌ వెలుగులోకి వచ్చింది. ఆ అఫిడవిట్ పరిశీలిస్తే కోసు దర్యాప్తు పురోగతి, ఏ కోణంలో సాగుతోందన్న విషయం అవగతమవుతోంది.

ప్రస్తుతం ఆ అఫిడవిట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ హల్‌ చల్‌ చేస్తోంది. ఈ సెక్స్ రాకెట్ లో భాగమైన కొందరి పేర్లు సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. ఆ అఫిడవిట్‌లో అమెరికా దర్యాప్తు అధికారులు పేర్కొన్న ఏ, బీ, సీ, డీ, ఈ ఎవరై ఉంటారని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది. వీరితో పాటూ మొత్తం బాధిత 10 మంది హీరోయిన్ల జాబితా కూడా వైరల్‌ అవుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఈ రాకెట్‌తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ 10 మందిలో ప్రముఖ ఏడుగురు హీరోయిన్లు, ముగ్గురు పాపులర్ యాంకర్ ల పేర్లు ఉన్నాయి.