బీజేపీ కి షాక్..టీడీపిలోకి చిత్తూరు బీజేపీ నేత     2018-04-29   01:38:23  IST  Bhanu C

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక పక్క చిత్తూరు జిల్లా తిరుపతిలో భారీ బహిరంగ సభని ఏర్పాటి చెయనున్నారు..ఏపీ పై మోడీ మొండి వైఖరికి నిరసనగా ఇప్పటికే చంద్రబాబు తన అపుట్టిన రోజున దీక్షని చేసి సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ నెల 30 తేదీన చంద్రబాబు సభని ఏర్పాటు చేసి అశేష ప్రజానీకం ముందు బిజేపీ బట్టలు ఊడతీయించే కార్యక్రమం చేపడుతున్నారు..అయితే ఇదే వేదికగా మోడీ షా లకి గట్టి షాక్ ఇవ్వనున్నారు కూడా అయితే సభలో కేంద్రాన్ని ఎకేయ్యడం ఒక షాక్ అయితే మరొక షాక్ ఏమింటే..

చిత్తూరు జిల్లాలో బీజేపీ నేత కారుమంచి జయరామ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు..ఇప్పటికే వరుసగా బీజేపి ని కాటసాని, కన్నా వంటి సీనియర్స్ వీడుతూ ఉంటే కారుమంచి బీజేపి ని వీడటం జిల్లాలో పెద్ద షాక్ అనే చెప్పాలి…2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున తిరుపతి లోకసభ స్థానానికి..పోటీ చేసిన కారుమంచి జయరామ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.శనివారం సాయంత్రం కారుమంచి తన రాజీనామా పత్రాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు ఫ్యాక్స్ చేశారు. ఈ నెల 30వ తేదీన తిరుపతిలో జరిగే ధర్మపోరాట దీక్ష బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.