ఉంగరం గుర్తులను తొలగించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు  

చాలా మంది ఉంగరాలను రెగ్యులర్ గా పెట్టుకుంటూ ఉంటారు. ఆలా చాలా కాలం పాటు పెట్టుకోవటం వలన ఉంగరం పెట్టుకొనే వేళ్ళ చుట్టూ గుర్తులు అలానే ఉండిపోతాయి. ఆ గుర్తులను తొలగించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే చాలా వరకు ఉంగరం గుర్తులు తొలగిపోతాయి. ఉంగరం బిగుతుగా ఉన్నప్పుడు అక్కడి చర్మానికి గాలి ఆడక తేమ ఆ ప్రదేశంలో పేరుకుపోయి పంగన్ ఏర్పడి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అక్కడ చర్మ సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించటం మంచిది. సమస్య పెద్దగా తీవ్రత ఇకపోతే మాత్రం ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాలను ఉపయోగించవచ్చు.

ఉంగరం గుర్తులు ఉన్న ప్రదేశంలో వారానికి రెండు సార్లు కలబంద రాస్తూ ఉండాలి. ఈ విధంగా చేయటం వలన ఆ ప్రదేశంలో ఉన్న మృతకణాలు తొలగిపోయి ఉంగరం గుర్తులు క్రమంగా తగ్గిపోతాయి.

ఒక్కోసారి సన్ తాన్ కూడా ఉంగరం గుర్తులను కఠినం చేస్తుంది. అందువల్ల బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవటం మంచిది.

ఒక స్పూన్ నిమ్మరసంలో ఒక స్పూన్ తేనే కలిపి ఉంగరం గుర్తులు ఉన్న ప్రదేశంలో రాస్తే క్రమంగా ఉంగరం గుర్తులు తొలగిపోతాయి.

వేలిపై కఠినమైన ఉంగరం గుర్తులను వదిలించుకోడానికి మేనిక్యూర్ సులువైన విధానం. నెలకి రెండు సార్లు అయినా మేనిక్యూర్, పెడిక్యూర్ లు చేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.