పళ్ళు ఆరోగ్యంగా,అందంగా ఉండాలంటే అద్భుతమైన చిట్కాలు     2018-04-14   01:40:11  IST  Lakshmi P

పళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మన మొత్తం ఆరోగ్యం బాగుటుంది. అలాగే పళ్ళు అందంగా తెల్లగా మెరిసిపోతూ ఉంటే ఆ ఆత్మవిశ్వాసం వేరు. పళ్ళు తెల్లగా ఉంటే మనం నవ్వినప్పుడు తెల్లని పళ్లవరసతో చూడముచ్చటగా ఉండి ఎదుటివారిని ఆకట్టుకోవచ్చు. ఇప్పుడు పళ్ళు అందంగా,ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.


ప్రతి రోజు రెండు సార్లు తప్పనిసరిగా బ్రష్ చేయాలి. ముఖ్యంగా పళ్ళు చిగుళ్ళను కలిసే చోట శుభ్రం చేయటం చిగుళ్ల సమస్యలు రాకుండా జాగ్రత్తపడవచ్చు. మెత్తని కుచ్చు ఉన్న బ్రష్ ని ఎంపిక చేసుకోవాలి. అలాగే బ్రష్ ని మూడు నెలలకు ఒకసారి మార్చుతూ ఉండాలి.