Three heroines in talk for Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ .. ఐదేళ్ళలో ఎంతలా మారిపోయాడు. ఒక టిపికల్ తెలుగు మాస్ హీరో నుంచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన తొలి తెలుగు హీరోగా ఎదిగాడు. నేషనల్ వైడ్ మార్కెట్ సాధించాడు. ఇప్పుడు ప్రభాస్ తదుపరి సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. అందుకే, బాహుబలి తెచ్చిపెట్టిన ఇమేజ్ కి భంగం కలగకూడదనే ప్రభాస్ తన తదుపరి సినిమా “సాహో” ని అత్యున్నత ప్రమాణాలతో ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నాడు. మళ్ళీ యాక్షన్, గ్రాఫిక్ అంశాలతో ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేస్తానంటున్నాడు.

మరీ ఆ రేంజ్ సినిమా అంటే దేశవ్యాప్తంగా తెలిసిన హీరోయిన్ కావాల్సిందేగా. 150 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తున్నప్పుడు ఓ పది కోట్ల బాలివుడ్ స్టార్ హీరోయిన్ కి పెట్టడం తప్పేమి కాదు కదా. అందుకే కత్రీనా కైఫ్ లాంటి ఓ పెద్ద హీరోయిన్ ని అడుగుతున్నారు. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూడా పోటిలోకి వచ్చింది. ప్రభాస్ తో నటించేందుకు సిద్ధమే అని ఆలియా భట్ తెలపడంతో ఇప్పుడు ఆలియా పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. ఇక మూడొవ భామ పూజ హెగ్డే.

ఒకవేళ ఆ ఇద్దరు హీరోయిన్లతో రెమ్యునరేషన్ మూలాన డీల్ ఓకే కాకపోతే, ఈ కుర్ర హీరోయిన్ ని తీసుకునే అవకాశాలున్నాయట. అంటే, హీరోయిన్ మీద 8-10 కోట్లు పెట్టడం ఎందుకు అనుకుంటే పూజకి దారులు తెరుచుకుంటాయి. లేదంటే కత్రీనా లేదా ఆలియా ఆ అవకాశాన్ని దక్కించుకోని సాహోలో ప్రభాస్ సరసన జోడి కడతారు.