This shock treatment can cure penis erection problems

ప్రపంవ్యాప్తంగా రంగు – రూపు, సైజు … ఇలాంటి తేడాలేవి లేకుండా పురుషులు ఎదురుకుంటున్న అతిపెద్ద శృంగార సమస్య అంగం సరిగా స్తంభించకపోవడం, లేదంటే శృంగారం మధ్యలోనే పడిపోవడం. ప్రతి ముగ్గురిలో ఒక్క పురుషుడికి ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుందట. ఇక మీరే అర్థం చేసుకోండి 30 లు దాటగానే శృంగార జీవితం ఎందుకు ఓ మూలాన పడిపోతోందో, వరల్డ్ వైడ్ గా ఎంతమంది పురుషులు ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నారో. ఈ సమస్య చికిత్స పేరుతో ఎన్నోరకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని కేసుల్లో వయాగ్రా లాంటి మాత్రలతో పనికానిస్తారు, కొన్ని కేసుల్లో హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు, కొన్ని కేసుల్లో రాడ్లు అమరుస్తారు .. మరికొన్ని కేసుల్లో షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఏంటి .. షాక్ ఇస్తారా అని ఆశ్చర్యపోతున్నారా ? అవునండి షాక్ ఇస్తారు. ఎక్కడ ఇస్తారు అని భయపడుతున్నారో అక్కడే ఇస్తారు, పురుషాంగం మీదే షాక్ ఇస్తారు. ఇది బాగా పనిచేస్తున్న టెక్నిక్ అంట.

అసలు అంగం ఎందుకు పడిపోతుంది ? అసలు ఆట కూడా మొదలవకుండా ఎందుకు స్తంభించదు ? కారణం ఏంటి ? ఏముంది? పురుషాంగంలోకి రక్తం రాకపోవడం వల్లనే. అంతేగా, పురుషాంగానికి అవసరమైన రక్త ప్రసరణ లేకపోతే అంగం స్తంభించదు. పురుషుడిలో ఎప్పుడైతే కామోద్రేకం కలుగుతుందో, అప్పుడు రక్తనాళాలు పెద్దగా అయ్యి, పురుషాంగంలోకి రక్తం బాగా చేరుతుంది. దాంతో అంగం బాగా గట్టిపడుతుంది. శృంగారానికి కావాల్సింది గట్టిపడిన అంగమే. అందుకే షాక్ ట్రీట్మెంట్ ద్వారా రక్త ప్రసరణ పెంచుతారు.