This is why Soggade Chinninayana has gone humongous

ఒకనాటి తెలుగుసినిమా అంటే ఇంటిల్లిపాదీ సరదాగా థియేటర్లకు వచ్చేవారు. నేలబేంచి నుంచి బాల్కనీ దాకా సినిమా అంటే అందరిది. సినిమా అర్థం కావట్లేదు, సినిమా అన్నివర్గాల్ని ఆకట్టుకోదు అనే మాటలు పెద్దగా వినబడేవి కావు. ఇప్పుడు అలా కాదు.. ఒక్కో సెక్షన్ ఆడియెన్స్ కి ఒక్కో సినిమా నచ్చుతుంది.

తాతయ్యా,బామ్మలను తీసుకోని మీ కుటుంబం అంతా సినిమాకి వెళ్ళి ఎంతకాలమైంది? గట్టిగా అడిగితే గుర్తు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం. మన దగ్గరి మనషులకి మన సినమా ఎప్పుడో దూరమైపోయింది. మాఫియా అని, డాన్ అని, హ్యాకింగ్ అని, టైట్ స్క్రీన్ ప్లే అని … రోజురోజుకీ సినిమా మల్టిప్లెక్స్ ప్రేక్షకులకి దగ్గరవుతోంది, కిందిస్థాయి ప్రేక్షకుడికి దూరమవుతోంది.

మాఫియా డాన్లు, మల్టి బిలినియర్లు, వేలకోట్ల రూపయలతో గేమ్స్ ఆడేవారు … వీరెవరు మన రోజువారి జీవితంలో భాగస్వాములు కారు. మనం చిన్నప్పటినుంచీ చదువుకుంటున్న కథల్లో కూడా వీళ్ళు లేరు. మరి సామన్య ప్రేక్షకుడు కథలో ఎలా లీనమవుతాడు?

ఇన్నాళ్ళకు క్లాసు, మాసు, 20 రూపాయల టికెట్టు, 250 రూపాయల టిక్కెట్టు అని తేడా లేకుండా అంతా సోగ్గాడే చిన్నినాయనకి బ్రహ్మరథం పడుతున్నారు. నాలుగొవవారంలో కూడా ఈ సినిమా ఊపు కనబడుతోందంటే దానికి కారణం అన్నివర్గాల ప్రేక్షకులకి అర్థం కావడమే.

మన పల్లే వాతావరణం … మనం చూస్తున్న మనుషులు … మన కుటుంబాలు .. ఇవన్ని సినిమాలో ఉండి తెలుగు సినిమా మూలాల్ని గుర్తు చేసింది కాబట్టే సోగ్గాడే చిన్నినాయన ఇంతపెద్ద బ్లాక్బస్టర్ అయ్యింది.