ముఖం కడుక్కోవాల్సిన కరెక్ట్ పధ్ధతి ఇది  

ముఖాన్ని సరిగా శుభ్రపరుచుకోవడం అనుకున్నంత ఈజీ పని ఏం కాదు. జనాభాలో నూటికి తొంభై తొమ్మిది మందికి ముఖాన్ని ఎలా కడుక్కోవాలో సరిగా తెలియదు కూడా. తెలిసీతెలియని పద్ధతుల్లో ముఖాన్ని కడుక్కోవడం వలన, శుభ్రపరుచుకునే సమయంలో చేసే తప్పుల వలన ముఖాన్ని పాడు చేసుకుంటుంటారు. మరి ముఖాన్ని ఎలా శుభ్రపరుచుకోవాలి ?

* బయట తిరిగి తిరిగి ఇంటికి రాగానే ముఖం మీద చాలా పెద్ద మొత్తంలో బ్యాక్టీరియ ఫార్మ్ అయిపోతోంది. మీ చేతులకి కూడా బ్యాక్టీరియ బాగా అంటుకొని ఉంటుంది. కాబట్టి చేతులు ముఖంపై పెట్టవద్దు.

* కాస్త వేడి నీళ్ళు పెట్టుకొని, మొదట చేతులు శుభ్రం చేసుకోండి.

* వేడినీళ్ళతో ఆవిరి పట్టడం వలన డ్రైగా ఉన్న స్కిన్ కాస్త హైడ్రేట్ అవుతుంది. దాంతో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం సులభం అవుతుంది.

* ఆ తరువాత చన్నీళ్ళు లేదా రోజ్ వాటర్ తీసుకొని ముఖంపై చల్లుకోండి. మెల్లగా, మెత్తగా ముఖాన్ని రాసుకోండి.

* సబ్బు వాడకపోతేనే మంచిది. ఏదైనా నేచురల్ టోనర్ తో క్లీన్ చేసుకుంటే మంచిది. శనగపిండి, తేనే, ఆపిల్ సీడెడ్ వెనిగర్ లాంటివి వాడండి.

* మళ్ళీ చన్నీళ్ళు చల్లుకొని, డ్రై టవల్ లేదా కాటన్ తో ముఖాన్ని తుడుచుకోండి.

* అంతే తప్ప, సున్నితమైన చర్మాన్ని గట్టిగా సబ్బుతో రుద్దటం, టవల్ లో గట్టిగా రాయడం, చేతులు శుభ్రం చేసుకోకుండా ముఖంపై వాడటం లాంటివి చేయవద్దు.