Things girls do when they are alone at home

మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు మనల్ని చూడట్లేదు అని తెలిసినప్పుడు, మనం ఏం చేస్తామో, ఎలా ఉంటామో .. అదే మన క్యారక్టర్ అంటూ పూరి జగన్నాథ్ ఒక ఫేమస్ డైలాగ్ రాసారు. క్యారక్టర్ లాంటి పెద్ద పెద్ద మాటలెందుకు కాని, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు మనల్ని గమనించట్లేదు అని తెలిసినప్పుడు ఏవేవో వింత ఆలోచనలు వస్తుంటాయి, ఎవరు చూడట్లేదు కదా అని చేయాలనిపించే పనులు చేస్తూ ఉంటారు. మరి ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయిలు చేసే పనులేంటి ? ఈ ప్రశ్నకు జవాబులు స్వయంగా అమ్మాయిలే చెప్పారు. ఒక యూట్యూబ్ ఛానెల్ నిర్వహించిన ఓ సర్వేలోని హైలెట్ సమాధానాలు ఇవిగో.

అమ్మాయి 1 :

(గట్టిగా నవ్వుతూ) ఏం చేస్తారు అంటే ఏం చెప్తాం .. అదేమీ పెద్ద సీక్రెట్ కాదుగా. అలాంటి అవకాశం, వీలు దొరికినప్పుడు ఖచ్చితంగా హస్తప్రయోగం చేసుకుంటారు. అబ్బాయిలైనా అంతేగా. ఎవరైనా అంతే. దీని గురించి బుర్ర పెట్టి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరు అంతే.

అమ్మాయి 2 :

ఇంట్లో పెద్ద అడ్డం ఉంటే, ఎవరి ఫిగర్ ని వారు చూసుకుంటారు. మేకప్ వేసుకొని సేల్ఫీలు దిగుతారు. పోర్న్ చూడటం, హస్తప్రయోగం చేసుకోవడం మూడ్ ని బట్టి ఉంటుంది కాని, అడ్డం ఎదురుగా నిల్చొని తమని తాము చూసుకుంటూ మురసిపోవడం, తమ ఫిగర్ ని తామే పదే పదే చూసుకోవడం మాత్రం ప్రతి అమ్మాయి చేసే పనే.