ఆ.. ఐఏఎస్ లు కాబోయే ఎమ్యెల్యేలు !     2018-09-14   12:35:26  IST  Sai M

తొండ ముదిరి ఊసరవెల్లి అవుతుంది… అలాగే నేటి కాలంలో ప్రభుత్వాధికారులు కూడా రాజకీయ పార్టీలతో మంచి సంబంధాలు నెరుపుతూ.. ఎమ్యెల్యేగా.. ఎమ్యెల్సీగా ఏదో ఒక పదవి సంపాదించేస్తున్నారు. మరికొందరు అధికారులయితే తమ ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నారు. అటువంటి అధికారులను పార్టీలు గుర్తించి తమ పార్టీలోకి ఆహ్వానించి టికెట్లు ఇస్తూ వారికి ఉన్న క్రెడిట్ రాజకీయంగా వాడుకునేందుకు ఆరాటపడుతున్నాయి. ఈ విధంగానే ఇప్పుడు ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులకు ఎమ్యెల్యే అయ్యే అవకాశం కల్పిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

IAS Officers Going To Participate In Election In 2019,jeo Srinivasa Rao In Chittoor,laxmi Kantham Ias,ramanjaneyulu IAS

ఈ నలుగురు అధికారులు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందడంతో వారికి ఎమ్మెల్యేలుగా పోటీ చేయించేందుకు చంద్రబాబు ఆసక్తిగా ఉన్నారట. గిరిజన కార్పొరేషన్‌ ఎండిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ‘బాబూరావు నాయుడు’ గిరిజన సామాజికవర్గానికి చెందిన అధికారి. కడప కలెక్టర్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఆయనను విశాఖపట్నంలోని గిరిజన వర్గానికి కేటాయించిన నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని బాబు నిర్ణయానికి వచ్చాడు. అలాగే.. తిరుమలలో జేఈవో గా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాసరాజును చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కీ.శే. గాలి ముద్దుకృష్ణమనాయుడు భార్యకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో మళ్లీ ఆ కుటుంబానికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో ‘నగరి’ నియోజకవర్గ టిక్కెట్‌ ‘శ్రీనివాసరాజు’కు దక్కవచ్చు. ఆయన సామాజికవర్గానికి చెందిన వారు ఇక్కడ ఎక్కువ ఉండడంతో బాబు ఈ నిర్ణయానికి వచ్చాడు.

IAS Officers Going To Participate In Election In 2019,jeo Srinivasa Rao In Chittoor,laxmi Kantham Ias,ramanjaneyulu IAS

పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమీషనర్‌గా మూడేళ్లుగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు..కొన్ని నెలలు గ్రామీణనీటి సరఫరా శాఖాధిపతిగా బాధ్యతలు నిర్వహించిన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి ‘రామాంజనేయులు’ ఇటీవల సమాచారశాఖ కార్యదర్శిగా నియమించిన విషయం విధితమే. దళిత సామాజికవర్గానికి చెందిన ఈ అధికారిని బాపట్ల, తిరుపతి లో లేక ఇంకేదైనా రిజర్వడ్ స్థానం నుంచి పోటీ చేయించేందుకు బాబు ఆలోచన చేస్తున్నాడు. అలాగే బాబు కి అత్యంత సన్నిహితుడైన కృష్ణా జిల్లా కలెక్టర్‌ ‘లక్ష్మీకాంతం’ సర్వీసు కొన్ని నెలలే ఉన్న నేపథ్యంలో ఆయనను కూడా ఎమ్మెల్యేగా ఎక్కడ నుంచి పోటీ చేయించాలనే దానిపై బాబు ఒక నిర్ణయానికి రాలేదు. కానీ..ఆయనను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని బాబు బలంగా నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.