These food give instant energy for tired people

కంప్యూటర్ మీద కూర్చొని ఎదో సీరియస్ గా వర్క్ చేసుకుంటున్నారు. ఇంతలో నిద్ర ముంచుకొస్తోంది .. ఎందుకు వస్తుంది అంటే అలసిపోయారు కాబట్టి. గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నారు … రెండు బాల్స్ వేసేసరికి బౌలింగ్ లో స్పీడ్ తగ్గిపోయింది ? ఎందుకు తగ్గింది అంటే అలసట వలన. ఈ అలసట అనేది ప్రాణాంతకం కాదు కాని, మన పనుల్ని మాత్రం చంపుతుంది. బద్దకాన్ని పెంచుతుంది. అలసత్వాన్ని ప్రోత్సహిస్తుంది. పనులు వాయిదాపడతాయి, పూర్తిగా ఆగిపోతాయి. అందుకే, శ్రమించేవారికోసం కొన్ని ఆహారపదార్థాలు ఉన్నాయి.