ఎన్టీఆర్‌ కోపం ఆ ఇద్దరి పైనేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కి కోపం వచ్చింది‌. సినిమా రివ్యూలు రాసే సినిమా జర్నలిస్టుల మీద టైగర్ లా విరుచుకుపడ్డాడు ఎన్టీఆర్. ఎన్నడు లేనిది, ఫిలిం క్రిటిక్స్ మీద తన కోపమంతా వెల్లగక్కాడు. ఇంత కోపం ఎందుకు వచ్చింది? సినిమా ఓపెనింగ్స్ బాగున్నాయి. 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల షేర్ వసూలు చేసింది జైలవకుశ. మరింకేం?

సినిమా హాస్పిటల్ బెడ్ మీద ఉన్న పేషెంట్ అయితే, ప్రేక్షకులు డాక్టర్లు. పేషెంట్లో ప్రాణం ఉందో, లేదో తేల్చాల్సింది ప్రేక్షకులు. మధ్యలో ఈ క్రిటిక్స్ ఎవరు? దారిన పోయే దాన్నయ్యలు. అంతా వీరికే తెలిసినట్టు సినిమా ఫలితాన్ని తేల్చేస్తారు అంటూ సినిమా రివ్యూ రైటర్స్ ని ఎద్దేవా చేసాడు ఎన్టీఆర్. ఇంతకి ఎన్టీఆర్‌ టార్గెట్ చేసింది ఎవరిని?