నారి నారి మధ్యన పవన్ పని గోదారి  

రాజకీయాల్లో చక్రం తిప్పుదామని చూస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఇద్దరు చుక్కలు చూపిస్తున్నారు. తన రాజకీయ అడుగులకు బంధల్లా వారు అడ్డుతగులుతూ తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు. పోనీ వారిని ఎమన్నా అందమా అంటే పవన్ కి వాళ్ళ విషయంలో అంత సీన్ లేదు. ఇంతకీ వాళ్ళు ఎవరో కాదు అందులో ఒకరు పవన్ మాజీ భార్య కాగా .. ఇంకొకరు వివాస్పద మోడల్ శ్రీ రెడ్డి. ఈ ఇద్దరు పవన్ విషయంలో ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అధికారమే లక్ష్యంగా తన రాజకీయ అడుగులు జాగ్రత్తగా వేస్తున్న పవన్ కి వీరిద్దరూ స్పీడ్ బ్రేకర్స్ లా మారారు.

ఉత్తరాంధ్ర పర్యటన పవన్ కి మంచి కిక్ ఇవ్వడంతో అదే ఊపుతో గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాడు. పనిలో పనిగా పార్టీలో చేరికలపై కూడా దృష్టి పెట్టి రాజకీయంగా బలపడి రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చెయ్యాలని చూస్తున్నాడు. అలాగే. అన్ని స్థానాల్లో గెలవకపోయినా కొన్ని సీట్లు గెలుచుకునైనా కింగ్ మేకర్ అవ్వాలని చూస్తున్నాడు. కానీ పవన్ ఆ అంశాలు మీద దృష్టి పెట్టలేకపోతున్నాడు. కారణం ఆ ఇద్దరు మహిళలే .

చాలా రోజులుగా సైలెంట్ అయిన శ్రీరెడ్డి మళ్లీ స్పీడ్ పెంచింది. పవన్ ను వ్యక్తిగతంగా, రాజకీయంగా దెబ్బతీసేందుకు ఆమె పోస్టులు పెడుతూనే ఉంది. ముఖ్యంగా జనసేన పార్టీ మహిళా విభాగం గురించి చెప్తూ.. తాను మహిళలకెంతో గౌరవిస్తానని, తన సినిమాలో అర్థనగ్న సీన్స్ అసలు ఉండవని, ఉండకుండా తానే నిర్ణయం తీసుకుంటానని గొప్పగా చెప్పుకున్న పవన్ పై సెటైర్ వేసింది శ్రీరెడ్డి. పవన్ సినిమాలోని ఓ ఫోటోను షేర్ చేస్తూ.. ఇదేనా పవన్ ఆడవాళ్లకు ఇచ్చే గౌరవం ఇదేనా సార్..అంటూ పోస్టు పెట్టింది.

ఇక పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రస్తుతం రెండో పెళ్లికి సిద్ధమవడంతో ఒక్కసారిగా పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేణు పెళ్లి చేసుకోవడాన్ని తప్పుబట్టారు. దీంతో మరింత ఆగ్రహానికి లోనైన రేణూదేశాయ్ పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను నోరు తెరిస్తే, మీరు, మీ దేవుడు ఎక్కడ ఉంటారో అంటూ పవన్ ఫ్యాన్స్ కు షాకిచ్చింది.
ముగిసిపోయిందనుకున్న వివాదాలు మళ్ళీ మళ్ళీ చెలరేగడం .. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అవన్నీ పవన్ కి చుట్టుకోవడం ఇదంతా గందరగోళంలా తయారయ్యింది. కచ్చితంగా ఈ అంశాలన్నీ రాబోయే రోజుల్లో పవన్ ని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం మాత్రం ఖాయం.