క్యాల్షియం మన శరీరంలో ఎన్ని కీలకమైన పనులను చేస్తుందో తెలుసా?    2018-05-30   23:11:21  IST  Lakshmi P

మన శరీరానికి అవసరమైన పోషకాలలో క్యాల్షియం చాలా కీలకం అని మనకు తెలిసిన విషయమే. క్యాల్షియం ఎముకలకు బలాన్ని ఇచ్చి దృడంగా చేస్తుందని అందరూ భావిస్తారు. కానీ క్యాల్షియం మన శరీరంలో ఎన్నో పనులను నిర్వర్తిస్తుంది. చాలా మందికి తెలియదు. ఇప్పుడు క్యాల్షియం మన శరీరంలో ఎన్ని రకాల పనులను చేస్తుందో తెలుసుకుందాం.

ప్రతి రోజు పాలు, గుడ్లు, పాలకూర, జీడిపప్పు, మునగాకు వంటి క్యాల్షియం సమృద్ధిగా లభించే ఆహారాలను తీసుకుంటే మన శరీరానికి అవసరమైన క్యాల్షియం అందుతుంది. అంతేకాక ఒకవేళ క్యాల్షియం లోపం ఉంటే కనుక తొలగిపోతుంది.

క్యాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవటం వలన అధిక బరువు ఉన్నవారు తగ్గుతారు. అలాగే క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది.