భర్తపై అనుమానంతో విడాకులు తీసుకోవాలనుకుంది..కానీ జడ్జి వేసిన ప్లాన్ తో భర్త ప్రేమను అర్ధం చేసుకుంది..ఇంతకీ జడ్జిగారు వేసిన ప్లానేంటో తెలుసా..     2018-09-11   12:12:48  IST  Rajakumari K

పెళ్లికి ముందు జరిగిన ప్రేమ వ్యవహారాలు పెళ్లి తర్వాత ఏదో రూపంలో వెంటాడతాయి..అప్పటివరకు అన్యోన్యంగా ఉన్న దంపతుల పచ్చని కాపురంలో చిచ్చుపెడుతుంటాయి..ఎన్నో కాపురాలు కూలి పోవడానికి ముఖ్య కారణాలు ఇవే..కానీ ఈ రోజుల్లో పెళ్లికి ముందు ప్రేమకథలు లేని వారు చాలా అరుదు..అందుకే పెళ్లికి ముందు ఏం జరిగిందనేది అనవసరం.పెళ్లి తర్వాత మాతో ఎంత ప్రేమగా ఉంటున్నారు అనేదే ముఖ్యం అనేంతగా యువత ఎదిగింది..కానీ భర్త ప్రేమ విషయం తెలిసిన భార్య భార్య కొడుకుని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.అంతేకాదు విడాకులు కావాలని కోర్టు వరకు వెళ్లింది..అక్కడే కథ అడ్డం తిరిగింది..భార్య విడాకుల్ని మంజూరు చేయాల్సిన జడ్జి వాళ్లిద్దరిని కలపాలని చూశాడు..అందులో భాగంగా ఒక ప్లాన్ వేశాడు.అదేంటంటే…

Family Court Judgement For Husband And Wife,Judgement For Divorce Case,The Judge Gives Great Judgement For Divorce Case

మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌కు చెందిన యువతితో ఇండోర్‌కు చెందిన టాక్సీ డ్రైవర్‌కు 2012లో పెళ్లి జరిగింది..ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారు.వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా వీరిద్దరికి ఓ బాబు కూడా పుట్టాడు..సంతోషంగా సాగుతున్న వీరి కాపురంలో హఠాత్తుగా గొడవలు స్టార్ట్ అయ్యాయి..దానికి కారణం అతగాడికి పెళ్లికి ముందున్న ప్రేమ వ్యవహారం భార్యకు తెలియడమే. భర్తపై బాగా అనుమానం పెంచుకున్న భార్య ఓ రోజు భర్తను అడిగింది. భర్త నిజం ఒప్పుకొని, చాలా కాలం నుంచి తనని ప్రేమిస్తున్నానని చెప్పాడు. దీంతో కోపంతో భార్య తన కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. విడాకులు ఇవ్వాలని కోరింది.

Family Court Judgement For Husband And Wife,Judgement For Divorce Case,The Judge Gives Great Judgement For Divorce Case

వీరిద్దరి కేసు విచారణ చేపట్టిన జడ్జీ గంగాచరణ్ దుబే.ఒక పెళ్లి చేయడానికి పెద్దలు ఎన్ని కష్టాలు పడతారో,విడాకులు ఇవ్వకుండా వారిద్దరిని కలపడానికి జడ్జిలు కూడా అంతే ప్రయాసపడతారు..వారిద్దరి వాదోపవాదనలు విన్న తర్వాత గంగాచరణ్ దంపతులను విడదీయలేక భర్తపై భార్యకు నమ్మకం కలిగించేందుకు ఒక ప్రయోగాన్ని ప్రయోగించాడు..అదేంటంటే ప్రతి రోజు ఉదయం భార్య పుట్టింటి వెళ్లి ఆమెకు ఓ గులాబీ పువ్వు ఇచ్చి రావాలని భర్తను ఆదేశించారు. దీంతో భర్త క్రమం తప్పకుండా ప్రతీ రోజు ఉదయం భార్య ఇంటికెళ్లి గులాబీ పువ్వు ఇచ్చి వచ్చేవాడు. అనుమానం పెంచుకున్న భార్యకు భర్త మారాడనే నమ్మకం కుదిరింది.దాంతో అతడి ప్రేమను అర్ధం చేసుకుని కొడుకుతో సహా భర్త దగ్గరకు వచ్చింది.ఇప్పుడు వారిద్దరూ సంతోషంగా ఉంటున్నారు..