మధుమేహం కారణంగా శరీరంలో కలిగే కీలకమైన మార్పులు     2018-04-13   03:36:19  IST  Lakshmi P

మధుమేహం అనేది చాలా భయంకరమైన మరియు సైలెంట్ కిల్లర్ అని చెప్పవచ్చు. మధుమేహం ఒకసారి వచ్చిందంటే జీవితాంతం మందులు వేసుకుంటూ కంట్రోల్ లో ఉంచుకోవాల్సిందే. అలాగే ఆహార నియమాలను కూడా పాటించాలి. ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్యల్లో ఒకటిగా మధుమేహం ఉంది. అలాంటి మధుమేహం కారణంగా మన శరీరంలో వచ్చే కీలకమైన మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం.

రక్తంలో చెక్కర కారణంగా రక్తనాళాలు సాగే గుణాన్ని కోల్పోయి రక్తనాళాలు సన్నపడతాయి. దీని కారణంగా గుండె పోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజానికి, మధుమేహ వ్యాధిగ్రస్తులలో హృద్రోగ మరణాలు కలిగే అవకాశం నాలుగురెట్లు అధికంగా ఉంటుంది.


మధుమేహ వ్యాధి గ్రస్తుల్లో రోజులు గడుస్తున్న రక్తప్రసరణ సరిగ్గా జరగక నరాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా చేతులు,కాళ్ళు మరియు వేళ్ళలో స్పర్శ కోల్పోతారు. దాంతో ఆ ప్రదేశాలలో ఏవైనా గాయాలు అయితే తొందరగా తెలుసుకోలేరు.