రాశుల ప్రకారం మీలో ఉండే లోపాలు... సరిదిద్దుకుంటే విజయము మీ సొంతం...ఎలా? Devotional Bhakthi Songs Programs     2018-01-11   22:13:05  IST  Raghu V

The dark side each Zodiac Sign

ఒక్కో రాశి వారికి ఒక్కో లోపం ఉండటం సహజమే. ఒక్కోసారి ఆ లోపల కారణంగా ఎన్నో ఇబ్బందులను పడవలసి రావచ్చు. మీ రాశి ప్రకారం ఆ లోపాన్ని తెలుసుకుంటే ముందే జాగత్త పడవచ్చు.

మేషం
ఈ రాశి వారు ప్రతి చిన్న విషయానికి అలిగి అవతలి వ్యక్తిని అపార్ధం చేసుకుంటారు. వీరు కాస్త చిన్న పిల్లల మాదిరిగా ప్రవర్తిస్తుంటారు.

వృషభం
ఈ రాశి వారు ఎదుటి వారి మాటను అసలు వినరు. వీరికి ఏది నచ్చితే అదే చేస్తారు. అలాగే మొండి పట్టుదల,కాస్త సోమరితనం ఉంటాయి. కాస్త గర్వం కూడా ఎక్కువే.

మిధున రాశి
ఈ రాశి వారు చాలా ప్రత్యేకంగా ఉంటారు. వీరు అవతలి వ్యక్తులు వింటున్నారా అనేది చూసుకోకుండా మాట్లాడుతూనే ఉంటారు. దాంతో అవతలి వ్యక్తులు కాస్త ఇబ్బంది పడతారు. వీరు అందరిని తొందరగా నమ్మేస్తారు.


కర్కాటకం
ఈ రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉండుట వలన ఎప్పుడు మూడీగా ఉంటారు. ఎవరైనా చిన్న మాట అన్నా తట్టుకోలేరు. వీరు చాలా పిరికిగా ఉంటారు.

సింహ రాశి
ఈ రాశి వారు చాలా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. వారి గురించి వారే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. వీరిని ఎవరైనా పట్టించుకోకున్నా, నిర్లక్ష్యం చేసినా అవతలి వ్యక్తిని ఎలాగైనా సరే ఇబ్బందుల్లో పడేయాలనే ఆలోచన కలిగి ఉంటారు.